Thursday, November 7, 2024

ప్రకాశం జిల్లాలో మహిళ దారుణహత్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో మహిళ దారుణహత్యకు గురైంది. జిల్లాలోని జిల్లెళ్ల పాడులో మహిళను హత్య చేశారు. హత్యకు గురైన మృతురాలు కోట రాధగా గుర్తించారు. నిన్న సాయంత్రం కనిగిరి వెళ్తున్నట్లు మహిళ చెప్పింది. తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆమె మృతదేహాన్ని జిల్లెళ్లపాడులో గుర్తించారు. అప్పు తీసుకున్న వ్యక్తే హత్య చేశాడని ఆమె తండ్రి అనుమానం వ్యక్తం చేశారు. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement