Friday, October 11, 2024

తెలంగాణ‌లో మ‌రో రెండు రోజులు భారీ ఎండ‌లు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఊష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం 9గంటల నుంచే ఎండలు భగ్గుమంటున్నాయి. ఈ ఎండలు మరో రెండు రోజులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 2 నుంచి 4 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కొత్తగూడెం జూలూరుపాడులో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రజలు బయటకు వెళ్లకపోవడం మంచిదని, ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే.. జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement