Saturday, April 27, 2024

Breaking: ఏపీ పీజీసెట్ రిజ‌ల్ట్.. 87.62 శాతం మంది ఉత్తీర్ణత

ఏపీ పీజీసెట్‌ 2021 ఫలితాలను విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ ఈ రోజు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో పీజీ ప్రవేశాలకి ఒకే సెట్ మొదటిసారిగా నిర్వహించామ‌న్నారు. ఆన్‌లైన్(online)లో నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలని రెండు వారాలలో ప్రకటించిన‌ట్టు తెలిపారు. పీజీ ప్రవేశాలకి 39,856 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రవేశ పరీక్షకి 35,573 మంది హాజరుకాగా 24,164 మంది అర్హత పొందారు. పీజీ సెట్ (AP PGCET 2021)లో 87.62 శాతం మంది అర్హత సాధించార‌న్నారు మంత్రి ఆదిమూల‌పు సురేశ్‌.

గతంలో అన్ని యూనివర్సిటీలకి ఒకే ప్రవేశ పరీక్ష ఉండకపోవడం వల్ల విద్యార్ధులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రవేశ పరీక్ష వల్ల అర్హత సాధించిన విద్యార్ధులు తమకు ఇష్ణమైన కోర్సులలో నచ్చిన యూనివర్సిటీలో చేరవచ్చు. ఉన్నత విద్యలో సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మకమైన మార్పులు చేపట్టారు. ప్రవేశపరీక్షలలో ఎటువంటి అవకతవకులకు ఆస్కారం లేకుండా కట్డుదిట్టంగా విజయవంతంగా నిర్వహించాం అని మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement