Saturday, May 4, 2024

రేపటి నుంచి బెజవాడలో బుక్ ఫెస్టివల్.. 11 రోజుల‌పాటు పుస్త‌క మ‌హోత్స‌వం..

అమరావతి: 32వ విజయవాడ పుస్తకమహోత్సవం జనవరి 1వ తేదీన‌ ప్రారంభం అవుతుంద‌ని బుక్ పెస్టివల్ ఉత్సవ కమిటి కన్వినర్ విజయ్ కుమార్ తెలిపారు.. పీడబ్ల్యూ గ్రౌండ్ లో జరగనున్న ఈ మహోత్సవాన్ని గవర్నర్ బిష్వభూషణ్ హరిచందన్ ప్రారంభిస్తారని 11 రోజుల పాటు బుక్ ఫెస్టివల్ జరగనుందన్నారు. నగరంలోని పిడబ్ల్యూడి గ్రౌండ్ లో బుక్ ఫెస్టివల్ ఉత్సవ కమిటీ ఆధ్వ‌ర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ కృష్ణా జిల్లా అధికార యాంత్రంగం సహయ సహాయ స‌హ‌కారాలతో ఈ సంవత్సరం ఎర్పాట్లు చేశామన్నారు..

రాష్ట్ర గవర్నర్ పుస్తక పండుగ‌ ఎర్పాట్లుకు 5 లక్షలు నిధులు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు.. 11రోజులు పాటు సాహిత్య సభలు, సంస్మరణ సభలు, పుస్తక పఠనం పెంపోందించే కార్యక్రమాలు.. ప్రతి రోజు ఎగ్జిబిషన్ ప్రాంగణంలో నిర్వహించ‌నున్న‌ట్టు చెప్పారు. బుక్ ఎగ్జిబిషన్ సోసైటి అధ్యక్షుడు మనోహర్ నాయుడు మాట్లాడుతూ 11రోజులుపాటు జరిగే పుస్తకాల పండుగలో మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొంటార‌ని తెలిపారు.. ప్రతి సంవత్సరం లాగానే 10శాతం ప్రత్యేక డిస్కౌంట్ ఈ సంవత్సరం కూడా కొనసాగుతుందనని.. మధ్యాహ్నం 2 గంటలనుండి రాత్రి 10గంటలవరకు బుక్ ఫెస్టివల్ కొనసాగుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement