Thursday, May 2, 2024

శ్రీవారి ఆస్తులు ఉన్నాయా? మయం అయ్యాయా?

వైసీపీ ప్రభుత్వం వచ్చాకా టీటీడీ ని బ్రష్టు పట్టించిందని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. వైసీపీ టీటీడిని అధాయ వనరుగా మార్చుకొందని ఆరోపించారు. ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో 52 మందికి పదవులు దేశవ్యాప్తంగా అమ్ముకున్నారని మండిపడ్డారు. వెంకన్న స్వామికి భక్తులు సమర్పించిన వెంట్రుకలు విదేశాలకు వైసీపీ నాయకులు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. తిరుమల పవత్రతను వైసీపీ మంటగలిపిందన్నారు. క్రిమినల్స్ ను ఆర్ధిక నేరగాళ్ల ను బోర్డ్ లో ఆహ్వానితుల పేరుతో వేశారని విమర్శించారు. స్వామి వారి విలువైన కానుకలు అస్తులు వున్నాయా? లేక అవి కూడా మయం అయ్యాయా? అని ప్రశ్నించారు. కోర్టులు తీర్పు వైసీపీకి చెంప పెట్టు అని పేర్కొన్నారు. ఇకనైనా భక్తుల మనోభావలను దృష్టి లో పెట్టుకోవాలని బోండా ఉమా హితవు పలికారు.

ఇది కూడా చదవండి: మరోసారి హస్తినకు సీఎం కేసీఆర్..

Advertisement

తాజా వార్తలు

Advertisement