Thursday, November 7, 2024

AP: సీఎం జ‌గ‌న్ పాల‌న‌పై మండిప‌డ్డ బీజేపీ నేత‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో సీఎం జ‌గ‌న్ పాల‌న‌పై బీజేపీ నేతలు రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేష్‌, బీజేపీ రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్ మండిప‌డ్డారు. వికసిత్ భారత్ లో పాల్గొనడానికి నేడు వ‌చ్చిన‌ సీఎం ర‌మేష్ మాట్లాడుతూ… భారత్ లో ఎంతో అభివృద్ధి చేశామ‌న్నారు. ఏపీలో 1.10లక్షల కోట్లతో 40 ప్యాకేజీల కింద జాతీయ రహదారుల అభివృద్ది చేశామ‌న్నారు.
విశాఖ ఎయిర్ పోర్టుల సంఖ్య 145కి పెరిగిందన్నారు. వ్యవసాయ, మౌలిక సదుపాయాలు రంగాల్లో అభివృద్ధి, పేదరిక నిర్మూలనకు కృషి, ప్రజల సూచనలు మేనిఫెస్టోలో పొందుపరుస్తామన్నారు.

జిల్లా స్థాయి కమిటీలు, ఏజెన్సీలు, వచ్చే ఎన్నికల్లో ఆర్టికల్ 370 రద్దు తో ఎన్ డీఏకి 400 సీట్లు వచ్చేలా ప్రచారం చేప‌డుతున్నామ‌న్నారు. ఏపీలో దోపిడీ ప్రభుత్వాన్ని దించేందుకు బీజేపీ-టీడీపీ- జనసేన పొత్తు అన్నారు. సీఎం జగన్ పచ్చి ఆబద్దాలు చెబుతున్నారన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో ఏపీని సర్వతోముఖాభివృద్ది చేస్తామ‌న్నారు. ప్రజలను మోసం చేయడమే జగన్ ధ్యేయమ‌న్నారు. తాను విశాఖలో పోటీ చేస్తానని అధిష్ఠానానికి చెప్పాన‌న్నారు.


రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ.. ప్రపంచంలో భారత్ ఐదో స్థానం నుంచి ప్రథమ స్థానానికి ఐదేళ్ల ప్రణాళిక అన్నారు. వికసిత్ భారత్ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు. మత్స్యకారుల సమస్యలు, కార్మికుల సమస్యలు తెలుసుకుంటున్న‌ట్లు చెప్పారు. మేనిఫెస్టోలో అంశాలు చెప్పేందుకు మిస్డ్ కాల్ ఇవ్వండన్నారు. ఏపీలో వైసీపీ పాలనకు చరమగీతం పాడాలన్నారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్, యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్ర రెడ్డి, ప్రకాష్ రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ రాము, పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement