Saturday, April 27, 2024

AP: కుప్పంలో నేనూ పోటీ చేస్తా… మ‌ద్ద‌తు ఇస్తారా… మ‌హిళ‌ల‌ను ప్ర‌శ్నించిన భువ‌నేశ్వ‌రి..

కుప్పం – టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నిజం గెలవాలి కార్యక్రమం చేపట్టారు. ‘ఆడబిడ్డలకు ఆర్థిక స్వేచ్ఛ’ అంశంపై కుప్పం మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో నాకు మద్దతిస్తారా…? చంద్రబాబు గారికి మద్దతిస్తారా…? అంటూ సభికులను సరదాగా ప్రశ్నించారు. చంద్రబాబును 35 ఏళ్లు గెలిపించారు… ఈసారి నన్ను గెలిపిస్తారా…? అని అడిగారు. దాంతో, ఆ కార్యక్రమానికి వచ్చిన వాళ్లు ఇద్దరూ కావాలంటూ జవాబిచ్చారు.


అలా కుదరదు… ఎవరో ఒకరి పేరే చెప్పాలంటూ నారా భువనేశ్వరి కోరారు. అయితే, ఇది తాను సరదాగానే అంటున్నానని చెప్పారు. ప్రస్తుతం తాను చాలా హ్యాపీగా ఉన్నానని రాజకీయాలకు తాను దూరంగా ఉంటానంటూ భువనేశ్వరి స్పష్టం చేశారు. ఎప్పుడూ సీరియస్ చర్చలే కాద‌ని, అప్పుడప్పుడు సరదాగా మాట్లాడుకోవాలని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement