Monday, April 15, 2024

TS: వారంలోనే రీజిన‌ల్ రింగ్ రోడ్డు ప‌నుల‌కు టెండ‌ర్లు… మంత్రి కోమ‌టిరెడ్డి

వారంలోనే రీజినల్ రింగ్ రోడ్డు పనులకు టెండర్లు పిలుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ… కేంద్రం నుంచి నిధులను తీసుకోవడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. గత ప్రభుత్వం చేతగానితనంతో రీజిన‌ల్ రింగ్ రోడ్డు పని ఆగిపోయిందన్నారు.

ఢిల్లీ పర్యటనలో చాలా అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించుకున్నామన్నారు. రూ.700 కోట్లతో నల్గొండ బైపాస్ రోడ్ ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మంజూరు చేశారని చెప్పారు. ఇందుకు ఆయనకు దన్యావాదాలు తెలిపారు. వారంలో భూమి సేకరించి టెండర్లు పిలుస్తామని చెప్పారని వెంకట్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌పై కిషన్‌రెడ్డి పిచ్చి మాటలు మానుకోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్‌ను టచ్‌ చేస్తే నామరూపాలు లేకుండా చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement