Friday, April 26, 2024

పంచాయతీ నిధులు ఏమైనట్లు?: BJYM డా.బైరెడ్డి శబరి

కేంద్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ఇచ్చిన నిధులు ఏమయ్యాయని ఏపీ ప్రభుత్వాన్ని BJYM రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.బైరెడ్డి శబరి ప్రశ్నిచారు. ఈ మేరకు బుదవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా డా. బైరెడ్డి శబరి మాట్లాడుతూ, దేశంలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందడం కోసం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విడుదల చేసిన కేంద్ర ఆర్థిక నిధులను రాష్ట్ర ప్రభుత్వం తమ సొంత స్వార్థ ప్రయోజనాల కోసం మళ్లించి దుర్వినియోగానికి పాల్పడిందని బైరెడ్డి శబరి ఆరోపించారు. కొత్తగా గెలిచిన సర్పంచులు కేంద్రం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామాలను అభివృద్ధి చేద్దామన్న ఆలోచనను ఏపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎలాగూ అభివృద్ధి చేయదని, కనీసం కేంద్రం ఇచ్చే నిధులతో అయినా అభివృద్ధి చేద్ధాం అనుకుంటే ఇలా ఏపీ ప్రభుత్వం తమ ఖాతాల్లోకి నిధులను మళ్ళించుకోవడం దుర్మార్గమైన చర్య అని సొంత పార్టీ సర్పంచులు అనడం విడ్డూరం అన్నారు. ఇలాంటి చేతకాని ప్రభుత్వం వల్ల గ్రామ సర్పంచులు రోడ్డున పడుతారని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి రాష్ట్ర ప్రజల కోసం కేంద్రం ఇస్తున్న నిధులను దుర్వినియోగం చేయకుండా ప్రజల అభివృద్ది కోసం సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement