Sunday, December 3, 2023

High Court: అంగళ్లు కేసుల్లో.. 79మంది టీడీపీ నేతలకు బెయిల్‌

అమరావతి: అంగళ్లు కేసుల్లో 79మంది టీడీపీ నేతలకు బెయిల్‌ మంజూరైంది. ఏపీ హైకోర్టు చిత్తూరు జిల్లా పుంగనూరు, అంగళ్లు కేసుల్లో టీడీపీ నేతలకు బెయిల్‌ మంజూరు చేసింది. చిత్తూరు, మదనపల్లె, కడప జైళ్లలో ఉన్న 79మంది నేతలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

- Advertisement -
   

బెయిల్‌పై విడుదలైన వారు ప్రతి మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో హాజరు కావాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు టీడీపీ ఎమ్మెల్సీ రాంభూపాల్‌రెడ్డిని తదుపరి విచారణ వరకు అరెస్ట్‌ చేయొద్దని స్పష్టం చేసింది. ఈ కేసుల్లోనే ముందస్తు బెయిల్‌ కోసం మరో 30మంది టీడీపీ నేతలు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. వారందరినీ తదుపరి విచారణ వరకు అరెస్ట్‌ చేయొద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement