Monday, April 29, 2024

Bail Rejected : వైఎస్ భాస్కర్ రెడ్డి జైల్లోనే..

ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అభియోగాలుఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి‌కి కోర్టులో చుక్కెదురైంది. వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం సీబీఐ వాదనలతో ఏకీభవించింది. ఈ క్రమంలో భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement