Monday, May 6, 2024

అవినాష్ రెడ్డి నిందితుడే.. సీబీఐ మళ్లీ నోటీసులు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాస్ రెడ్డి నిందితుడేనంటూ సీబీఐ స్పష్టంగా ప్రకటించింది. ఈకేసులో నేడు విచారణకు హాజరుకావాల్సిందిగా సీబీఐ నోటీసులు జారీ చేసినప్పటికీ అవినాష్ హాజరుకాలేదు. ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు. హైకోర్టు నిర్ణయం వెలువడిన తర్వాత మాత్రమే తాను సీబీఐ విచారణకు హాజరవుతానని వెల్లడించారు. అంతకు ముందు అవినాష్ మీడియాతో మాట్లాడుతూ… ఈకేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనను అనవసరంగా ఇరికిస్తున్నారని మీడియా ముందు మొరపెట్టుకున్నారు.

వైఎస్ వివేకాకు ఉన్న వివాహేతర సంబంధాల వల్లే హత్యకు గురయ్యారని మరోసారి చెప్పారు. ఇదిలా ఉంటే హైకోర్టులో అవినాష్ బెయిల్ పిటిషన్ పై వాదనలు జరుగుతున్న నేపథ్యంలో సీబీఐ అవినాష్ కు మరో నోటీసు జారీ చేస్తూ రేపు ఉదయం 10.30గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా కోరింది. హైకోర్టు వాదోపవాదనల్లో తనను అరెస్టు చేయకుంటే విచారణకు హాజరవుతానని అవినాష్ పేర్కొన్నారు. దీనికి కౌంటర్ గా ఈకేసు విచారణ ఈనెల 30వతేదీలోగా పూర్తి చేయాలని కోర్టు ఆదేశాలున్నాయని తెలిపింది. విచారణకు అవినాష్ రెడ్డిని ఎప్పుడు పిలిచినా కోర్టుల్లో పిటిషన్లు వేస్తూ కాలయాపన చేస్తున్నారంటూ తన వాదనలు వినిపించింది. ప్రస్తుతం కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement