Friday, April 26, 2024

APSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారందరికీ ఎలక్ట్రిక్ బైక్‌లు!

ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు ఆ సంస్థ శుభవార్త చెప్పింది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో మొత్తంగా ఏడువేల మంది ఉద్యోగులకు వాయిదా పద్ధతిలో ఎలక్ట్రిక్ బైక్‌లను అందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. సంప్రదాయ ఇంధన వనరుల వినియోగానికి శ్రీకారం చుట్టిన ఆర్టీసీ.. అందులో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే, బస్‌స్టేషన్లలో సోలార్ పవర్ ప్లాంట్లు, ఈవీ చార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది.

సంప్రదాయ ఇంధన వనరుల సంస్థ ఉన్నతాధికారులు ఇటీవల ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావును కలిసి బస్‌స్టేషన్లలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా సోలార్ విద్యుత్‌ను అందిస్తామని, ఉద్యోగులకు నాణ్యమైన ఎలక్ట్రిక్ వాహనాలను అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో, ఆర్టీసీ ఎండీ ఉద్యోగులందరికీ ఎలక్ట్రిక్‌ వాహనాలు అందించటానికి చర్యలు చేపట్టారు. ఉద్యోగులకు నాణ్యమైన బ్యాటరీ కలిగి నాలుగేళ్ల వారంటీతో కూడిన వాహనాలు అందించేందుకు నెడ్‌క్యాప్ ముందుకొచ్చింది. ఈవీ రంగంలో అనుభవం ఉన్న సంస్థతో నెడ్‌క్యాప్ ఒప్పందం చేసుకుని ఆర్టీసీ ఉద్యోగులకు వాహనాలు అందిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement