Friday, May 3, 2024

AP | పదవ తరగతి పరీక్షలకు ఆర్టీసీ సర్వీసు ఉచితం

అమరావతి, ఆంధ్రప్రభ : వచ్చే నెల (మార్చ్) 18వ తేదీ నుంచి జరుగనున్న పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్ధులకు ఆర్టీసీ బస్సులలో ఉచిత సౌఖర్యాన్ని కల్పించాలంటూ ఏపీ ట్రాన్స్‌పోర్ట్‌ ఈడీ అన్ని జిల్లాల ఏపీఎస్‌ఆర్టీసీ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌లకు ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే నెల 18 నుంచి 30వ తేదీ వరకు పబ్లిక్‌ పరీక్షలు ఉండటంతో ఆయా జిల్లాలు, మండలాల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలకు చేరుకునే విద్యార్ధులకు ఆర్టీసీ సీ బస్సు సౌఖర్యాన్ని కల్పించాలంటూ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ డి. దేవానంద రెడ్డి ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ తిరుమల రావును లిఖితపూర్వకంగా కోరారు.

ఈ మేరకు 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు జరిగే రోజులలో పదవ తరగతి విద్యార్ధులకు ఉచిత సౌఖర్యం కల్పించాలని ఆర్టీసీ స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బస్‌ పాస్‌లు లేని విద్యార్ధులకు హాల్‌ టికెట్‌ ఆధారంగా ఉచిత సౌఖర్యాన్ని కల్పించాలన్నారు. పరీక్షలు జరిగే తేదీ, పరీక్ష ప్రారంభించె, ముగిసే సమయాలలో ఉచిత సౌఖర్యాలను కల్పించాలంటూ పరీక్షల షెడ్యూల్‌ను జిల్లాల వారీగా ఆర్టీసీ అధికారులకు చేరవేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement