Monday, April 29, 2024

HYD: ఫైర్‌సైడ్ వెంచర్స్, మల్టిప్లై వెంచర్స్ నుండి సిరీస్ ఏ నిధులను పొందిన ఇలువియా

హైదరాబాద్ : ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న రెనౌరా వెల్‌నెస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహణలోని ఒక ప్రొఫెషనల్ హెయిర్‌కేర్ బ్రాండ్, ఇలువియా ఇప్పుడు ఫైర్‌సైడ్ వెంచర్స్, మల్టిప్లై వెంచర్స్ నుండి సిరీస్ ఏ నిధులను పొందింది. ఈ పెట్టుబడి సంస్థకు కీలకమైన మైలురాయిని సూచిస్తుంది.

ఈసంద‌ర్భంగా రెనౌరా వెల్‌నెస్ ప్రైవేట్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకులు నిషాంత్ గుప్తా, పలాష్ పాండే మాట్లాడుతూ… ఈ పెట్టుబడి త‌మ లక్ష్యాన్ని ధృవీకరిస్తుందన్నారు. ప్రొఫెషనల్ హెయిర్‌కేర్ పరిశ్రమలో విప్లవాత్మకమైన త‌మ లక్ష్యంకు తోడ్పాటునిస్తుందన్నారు. ఈ నిధులతో నిపుణులు, వినియోగదారుల కోసం వినూత్నమైన, ప్రత్యేకమైన పరిష్కారాలతో త‌మ ఉత్పత్తి ఆఫర్‌లను మరింత విస్తరింపజేసేటప్పుడు త‌మ ఆర్ అండ్ డీ పెట్టుబడులను పెంచడానికి త‌మకు తోడ్పడుతుందన్నారు.

ఫైర్‌సైడ్ వెంచర్స్ సహ వ్యవస్థాపకుడు, భాగస్వామి దీపంజన్ బసు మాట్లాడుతూ… ఇలువియాలో త‌మ పెట్టుబడి ప్రతిష్టాత్మక, వినూత్నమైన వినియోగదారు బ్రాండ్‌లను నిర్మించడంలో త‌మ నిబద్ధతకు నిదర్శనమ‌న్నారు. సైన్స్‌పై బ్రాండ్ ఆధారపడటం, వారి ఖచ్చితమైన ఆర్ అండ్ డీ ప్రక్రియ కారణంగా వారు వ్యక్తిగత సంరక్షణలో గొప్ప ఆవిష్కర్తలుగా కనిపిస్తున్నారన్నారు. తాము వారి దూర దృష్టిని విశ్వసిస్తున్నామన్నారు.

- Advertisement -

మల్టిప్లై వెంచర్స్‌ వ్యవస్థాపకుడు అండ్ జనరల్ పార్టనర్ అయిన సంజయ్ రామకృష్ణన్ మాట్లాడుతూ… భారతదేశంలో అందం, వ్యక్తిగత సంరక్షణ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. మార్కెట్ అవసరాలను తీర్చడానికి అనేక మార్గాలున్నాయ‌న్నారు. మల్టిప్లై వద్ద తాము మొదటి నుండి పలాష్, నిషాంత్, ఇలువియాతో భాగస్వామ్యం కలిగి ఉన్నందుకు సంతోషంగా ఉన్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement