Tuesday, July 23, 2024

TS | ఇక రూ.29కే కిలో సన్నబియ్యం.. అందుబాటులోకి రానున్న భారత్‌ రైస్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణాలోకి భారత్‌ రైస్‌ అందుబాటులోకి రానున్నట్టు నాఫెడ్‌ తెలుగు రాష్ట్రాల ఇన్‌చార్జి వినయ్‌ కుమార్‌ తెలిపారు. 5, 10 కేజీల రైస్‌ బ్యాగుల ద్వారా అమ్మకాలు జరుగుతాయని వివరించారు. రైతు బజార్ల ద్వారా బియ్యం సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇప్పటికే భారత్‌ ,ఆట దాల్‌ లాంటివి కూడా పలు స్టోర్లలో అందుబాటులో ఉంచామని వివరించారు.

కాగా.. రోజురోజుకు దేశ వ్యాప్తంగా సన్న బియ్యం ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో ధరలను నియంత్రించేందుకు భారత్‌ రైస్‌పేరుతో సబ్సిడీ సన్న బియ్యాన్ని రి-టైల్‌ అవుట్‌లెట్ల ద్వారా విక్రయించాలని కేంద్ర ప్రభుత్వంనిర్ణయించింది. ప్రస్తుతం మార్కెట్‌లో బియ్యం రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. కిలో సన్నబియ్యం రిటైల్‌ మార్కెట్లో రూ.50 నుంచి 60 వరకు ఉంది.

దీంతో బియ్యం ధరల పెరుగుదలను అరికట్టేందుకు చర్యలు ప్రారంభించిన కేంద్రం రూ.29కే భారత్‌ రైస్‌ విక్రయించే దిశగా అడుగులు వేసింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం భారత్‌ బ్రాండ్‌ కింద కిలో శనగపప్పు రూ.60 కే విక్రయిస్తుండగా.. భారత్‌ ఆట్టా (గోధుమపిండి) కేజీ రూ. 27.50 కే విక్రయిస్తోంది. దీంట్లో భాగంగానే భారత్‌ బ్రాండ్‌ రైస్‌ తక్కువ ధరకే తీసుకువచ్చింది. కొద్ది రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రంలోనూ విరివిగా భారత్‌ రైస్‌ సామాన్య, పేద ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement