Friday, June 21, 2024

సీఎం జగన్ ను కలిసిన ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌

ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ దామోదర్‌ గౌతమ్‌ సవాంగ్‌ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అనంతరం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, ఏపీ డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ ను ప్రభుత్వం ఇటీవల బదిలీ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనను ఏపీపీఎస్సీ చైర్మన్ గా నియమించింది. ఈ నేపథ్యంలోనే ఆయన గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. కాగా, డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement