Wednesday, May 1, 2024

AP – మరి కొద్దిసేపటిలో చంద్ర బాబు, పవన్ చేతుల మీదుగా టీడీపీ – జనసేన తొలి జాబితా విడుదల

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నాయి. వైసీపీ ఇప్పటికే పలువురు అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ – జనసేన కూటమి ఈరోజు తమ ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తోంది. తొలి జాబితాలో 65 మంది ఎమ్మెల్యేలు, కొందరు ఎంపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. 65 మంది ఎమ్మెల్యేలలో 50 మంది టీడీపీ, 15 మంది జనసేన అభ్యర్థులు ఉండవచ్చని సమాచారం.

ఈరోజు మంచి రోజు (మాఘ పౌర్ణమి) కావడంతో అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నారు. ఉదయం 11.40 గంటల సమయంలో జాబితాను విడుదల చేయనున్నట్టు సమాచారం. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ కలిసి జాబితాను విడుదల చేస్తారు

Advertisement

తాజా వార్తలు

Advertisement