Monday, April 29, 2024

AP: బ‌ద్వేలు బై పోల్‌లో రిగ్గింగ్.. వైసీపీ పని అయిపోయిందన్న బీజేపీ చీఫ్ వీర్రాజు

బ‌ద్వేలు ఎన్నిక‌లో వైసీపీ రిగ్గింగ్‌గుకు పాల్ప‌డింద‌ని, 30వేల దొంగ ఓట్ల‌ను తొల‌గించాల‌న్నారు బీజేపీ స్టేట్ చీఫ్ సోము వీర్రాజు. దీనికి సంబంధించి మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డితో క‌లిసి ఈ రోజు ఉద‌యం క‌డ‌ప‌లో ప్రెస్‌మీట్ పెట్టారు.

ఇంకా ఏమ‌న్నారంటే..
‘‘ఎన్నికల్లో 20 పోలింగ్ బూతుల లో వైసిపి రిగ్గింగ్ కు పాల్పడింది. 30 వేల దొంగ ఓట్లను తొలగించాల్సిందే. వైసిపి రిగ్గింగ్ ను స్వయంగా కడప జాయింట్ కలెక్టర్ గౌతమి అడ్డుకున్నారు. ఎన్నికల నిర్వహణలో పోలీసులు , అధికార యంత్రాంగం ఫెయిల్ అయ్యింది. రీపోలింగ్ నిర్వహించాల్సిందే. రిగ్గింగ్ పై సుప్రీం కోర్టుకు వెళ్తాం.

వైసిపి సినిమా ఇక ముగిసినట్లే..
ప్రజల్లో బలం ఉంటే రిగ్గింగ్ ఎందుకు చేస్తారు. ప్రొద్దుటూరు, సికె దిన్నె, కడప నుంచి బయట వ్యక్తులు వచ్చి దొంగ ఓట్లు వేశారు. రీపోలింగ్ జరపకపోతే రిగ్గింగ్ చేసిన 30 వేల ఓట్లను ఓట్ల ను తొలగించి రిజల్ట్ ప్రకటించండి. బద్వేల్ లో రిగ్గింగ్ జరిగిందా లేదా మీ ఆత్మ సాక్షిగా చెప్పండి. ఉప ఎన్నిక రిగ్గింగ్ పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. స్టేట్ ఎన్నికల కమిషన్ విజయానంద్ పై మాకు నమ్మకం లేదు. జిల్లా ఎస్పీ కలెక్టర్ వైసిపికి అనుకూలంగా వ్యవహరించారు. పోలింగ్ బూత్ లో సిసి కెమెరాలు పనిచేయడం లేదు.’’ అన్నారు సోము వీర్రాజు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement