Monday, July 15, 2024

AP | జగన్ కి ప్రతిపక్ష హోదా… టీడీపీ కౌంటర్

అసెంబ్లీలో జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు.. అయితే, తనకు సభా సంప్రదాయం ప్రకారం సీఎం తరువాత ప్రమాణం చేసే చాన్స్ ఇవ్వకుండా ఉల్లంఘించారని… అప్పటికే తనకు విపక్ష నాయకుడి హోదా లేదని నిర్ణయించేసారా అని జగన్ తాజాగా స్పీకర్ కి రాసిన ఒక లేఖలో ఆక్షేపించారు. ఇక సంఖ్యతో సంబంధం లేకుండా విపక్ష హోదా ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని జగన్ ఆ లేఖలో కోరారు.

అయితే జగన్ కి టీడీపీ మంత్రి సంధ్యారాణి ధీటుగా బదులిచ్చారు. సభా సంప్రదాయాల గురించి మాట్లాడే జగన్ సభలో తన పార్టీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తున్నపుడు అయినా ఉండాలన్న ఆలోచన ఎందుకు లేకుండా వెళ్ళిపోయారని నిలదీశారు. స్పీకర్ ఎన్నికల వేళ సభా నియమాలు అనుసరించి సభలో ఉండాలని తెలియదా అని ప్రశ్నించారు.

మీ గౌరవం గురించి అడుగుతున్నారు కానీ స్పీకర్ కి మీరు గౌరవం ఇచ్చారా అని సంధ్యారాణి జగన్ ని సూటిగా ప్రశ్నించారు. స్పీకర్ ఎన్నికలు మీరు రాలేదు కానీ సభా సంప్రదాయాల గురించి మాట్లాడమేంటని ఆమె విమర్శించారు. పంచభూతాలు సైతం బాధపడేలా అయిదేళ్ళ పాలను చేయడం వల్లనే 151 సీట్ల మధ్యలో 5 ఎగిరిపోయిందని ఆమె ఎత్తి చూపారు.

జగన్ విపక్ష హోదా గురించి అడగడం బాగా లేదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. స్పీకర్ ఎన్నికకు సభలో ఉండలేదని అలా విపక్ష నేతగా తన బాధ్యతలను పక్కన పెట్టిన జగన్ కి మళ్లీ హోదా గురించి అడగడం ఏ మాత్రం సమంజసం అని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement