Sunday, April 28, 2024

21వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి.. ఏపీ ఎన్జీవో నేతల పిలుపు..

ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో – ఏ.పి.ఎన్జీవో సంఘం 21వ మహసభలు 21వ తేదీన ప్రారంభం కావడం మాకెంతో సంతోషంగా ఉన్నదనీ ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు కార్యదర్శి శివారెడ్డి తెలిపారు. ప్రతీ మూడు సంవత్సరాలకొకసారి జరగవలసిన ఈ మహాసభలు కరోనా వలన చాలా ఆలస్యమైందన్నరు. ఈ మహాసభలలో ఏ.పి. ఎన్జీవో సంఘం స్థితిగతులను, మంచి చెడులను విశ్లేషించుకుని, సంఘం ఏ రీతిగా నడవాలో చర్చించుకొని, సంఘ బైలాలో ఏమైనా మార్పులు చేర్పులు అవసరమైతే వాటిని మహాసభ ఆమోదముతో అమలు చేయడమే ఈ మహాసభల ముఖ్య ఉద్దేశ్యం అని ప్రకటించారు. నగరంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సంఘం ఆవిర్భావం నుండి ఈ మహాసభలకు రాష్ట్రముఖ్యమంత్రి హాజరవడం కూడా సాంప్రదాయంగా వస్తుందన్నరు.ఆ సాంప్రదాయమును అనుసరించి, ఈ సారి కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ఈ మహాసభలకు హాజరై, సభలను ప్రారంభించి ప్రసంగిస్తారన్నారు. 73 సంవత్సరాలు పైబడి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల సాధనే పరమావధిగా పోరాటాల బాటలో నిస్వార్ధంగా, ఏ రాజకీయ పార్టీ ప్రభావంలేకుండా నడుస్తున్న ఏకైక ఉద్యోగ సంఘం ఏ.పి.ఎన్జీవో సంఘం అని చెప్పడానికి గర్వపడుతున్నామ అన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకపూర్వం నుండి ఉద్యోగలోకం సమస్యలపై విప్లవబావుటా ఎగురవేసి, రాష్ట్రంలోని ఉద్యోగులందరినీ ఏకం చేసి) సంఘటితపరచి, ఎన్నో రాయితీలను అందించిన ఘనత ఈ సంఘానిదేనని చెప్పకతప్పదన్నారు. ఉద్యోగుల సమస్యల సాధనలో ఎందరో నాయకులు ప్రభుత్వ ఆగ్రహానికి గురై, ఎన్నో భాధలు ఎదుర్కొన్నారన్నారు. ఆఖరుకు పోలీసు కాల్పులలో కొందరు వీరమరణం చెందారన్నారు.

సాంకేతికాభివృద్ధి చెందుతున్న సమయంలో నాయకులు తమ సంఘ సహచరుల నుండి, ఇతర ఉద్యోగినీ, ఉద్యోగుల నుండి
ఎన్నో విమర్శలను, శాపానార్థాలను ఎదుర్కొన్నారు. అయినా మొక్కవోని దీక్షతో ఉద్యోగులకు ఎదురయ్యే అనేక సమస్యల
కోసం పోరాడి ఎన్నో రాయితీలను తీసుకు వచ్చిన ఏకైక సంఘం ఏ.పి.ఎన్జీవో సంఘమేనని సగర్వంగా చెప్పటానికి సంతోషపడుతున్నాన్నారు. ఈ మహాసభలలో ఏ.పి. ఎన్జీవో సంఘ తాలూకా, జిల్లా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సంఘ సభ్యులు
పాల్గొంటారన్నారు.

ఈ సమావేశంలో సంఘ అభివృద్ధి కొరకు తీసుకోవలసిన చర్యల గూర్చి సుదీర్ఘంగా చర్చించి కొన్ని తీర్మానాలు చేయడం,
నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సారికూడా కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టి, సభ్యులతో ఆమోదింపచేయించాలని
ప్రతిపాదించదలచాఅన్నారు. అందులో ముఖ్యంగా గజిటెడ్ ఉద్యోగులను సంఘ సభ్యులుగా చేసుకునే విధంగా మార్పు చేసి
అవసరమైతే సంఘం పేరును కూడా కొద్దిగా మార్పు చేయాలనే ఆలోచన ఉన్నది. ఏది ఏమైనా సుశిక్షితులైన సైనికులవలే
ఏ.పి.ఎన్జీవో సంఘ సభ్యులంతా క్రమశిక్షణతో, నియమ నిబంధనలతో ఈ మహాసభ సమావేశాలలో పాల్గొని జయప్రదం
చేయుటకు తాలూకా, జిల్లాల నుండి వేలాదిగా తరలివస్తున్న ఏ.పి. ఎన్జీవో సంఘ నాయకులకు, సభ్యులకు స్వాగతం-
సుస్వాగతం రాష్ట్ర సంఘం తరపున పలుకుతూ ఈ మహాసభలను జయప్రదం చేయుటలో అందరూ సహకరిస్తారని
ఆశిస్తున్నామని రాష్ట్ర అధ్యక్ష ప్రధానకార్యదర్శులు బండి శ్రీనివాసరావు కె.వి. శివారెడ్డిలు వెల్లడించారు. ఈసమావేశాలకు సంఘ రాష్ట్రమాజీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఇతర రాష్ట్ర నాయకులతో పాటు, ఏ.పి.జె.ఏ.సి.లలో సభ్య సంఘాల నాయకులు, ఇతర జె.ఏ.సి. సంఘాల నాయకులు కూడా హజరుకాగలరని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో ఏ.పి.ఎన్జీవో సంఘ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహిళా విభాగం నాయకురాళ్ళు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement