Wednesday, May 8, 2024

మాజీ మంత్రి అయ్యన్నకు ఊరట.. ఆ కేసులో దర్యాప్తును నిలిపివేస్తూ ఉత్తర్వులు

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై దర్యాప్తును నిలిపివేసింది. ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వర్ధంతి సభలో సీఎం జగన్‌, హోంమంత్రిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ సెప్టెంబరు 18న కొత్తపల్లి ప్రసాద్ అనే వ్యక్తి నకరికల్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం, విపత్తుల నిర్వహణ చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

అయితే, తనపై మోపిన కేసులను కొట్టివేయాలంటూ అయ్యన్న హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం ఈ  పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి. హోంమంత్రిని ఉద్దేశించి పిటిషనర్ వ్యక్తిగతంగా మాట్లాడలేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఆయనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదు చేసిన సెక్షన్లు వర్తించబోవని తెలిపారు. దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్‌లో ఇది వరకే ఐపీసీ 504, 505 కింద ఎఫ్ఐఆర్ నమోదై ఉందని, కాబట్టి ఎఫ్ఐఆర్ 217 ఆధారంగా దర్యాప్తు అవసరం లేదని చెప్పారు. అనంతరం.. ఒకే ఘటనపై బహుళ ఎఫ్ఐఆర్‌లు సరికాదని సుప్రీంకోర్టు ఇది వరకే చెప్పిన విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది. ఎఫ్ఐఆర్ 217 ఆధారంగా జరిపే దర్యాప్తును నిలిపివేసి, విచారణను వాయిదా వేసింది.

ఇది కూడా చదవండిః హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు.. టీఆర్ఎస్ కు ధీటుగా రేవంత్ స్కెచ్

Advertisement

తాజా వార్తలు

Advertisement