Friday, April 26, 2024

AP High Court: గ్రూప్-1 పరీక్ష రద్దు పిటిషన్‌.. విచారణ వచ్చే నెల 18కి వాయిదా..

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) నిర్వహించిన గ్రూప్ 1 పరీక్ష రద్దు విషయంలో ఏపీ ప్రభుత్వం అప్పీల్ పిటిషన్ పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది.. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్‌లో సవాలు చేసింది ఏపీపీఎస్సీ.. అయితే, ఈ పిటిషన్‌పై ఈ నెల 21వ తేదీక కీలక ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు.. ఈ రోజు విచారణ జరపాల్సి ఉండగా.. తదుపరి విచారణను వచ్చే నెల 18వ తేదీకి వాయిదా వేసింది.. ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నవారు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కొనసాగుతారని గతంలోనే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం విదితమే.

ఇక, ఈనెల 21వ తేదీన గ్రూప్ 1 పరీక్ష రద్దుపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై తాత్కాలిక స్టే విధిస్తూ.. ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నవాళ్లు యథావిధిగా కొనసాగుతారని డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది.. ఇదే సమయంలో ఏపీపీఎస్సీ దాఖలు చేసిన పిటిషన్‌పై తదుపరి విచారణ 27వ తేదీకి అంటే ఈ రోజుకి వాయిదా వేయగా.. ఈ రోజు విచారణను మరోసారి వచ్చే నెల 18వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement