Thursday, April 25, 2024

TS : గెలుపు మనదే.. మళ్లీ గెలిచేది కేసీఆరే.. మాజీమంత్రి

ఈ సారి గెలుపు మనదే.. మళ్లీ గెలిచేది కేసీఆరే అంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలు గెలుస్తామ‌ని అంబున్నార‌ని వాళ్లు చేసిందేమీ లేద‌ని దుయ్యాబ‌ట్టారు. మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాల‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు.

- Advertisement -

మొన్న ఎన్నికల్లో ఎందుకు కాంగ్రెస్ కు ఓటు వేశామో అని ప్రజలు అనుకుంటున్నారు అని మల్లారెడ్డి అన్నారు. మల్కాజ్ గిరి పార్లమెంట్ లో వాళ్ళకి క్యాడర్ లేదని, ఏం మొహం పెట్టుకొని వాళ్లు ఓట్లు అడుగుతారు అని ఆయన మండిపడ్డారు. గ్యాస్ సిలెండర్ ధర 1200 రూపాయలకు పెంచి పేదలను దోచుకుంటున్నారు.. దేశ ప్రజలను జాతీయ పార్టీలు మోసం చేశాయని మల్లారెడ్డి అన్నారు.

హైదరాబాద్, మల్కాజ్ గిరిలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే గెలిచారు.. ఊర్లలో మాత్రమే బీఆర్ఎస్ ఓడిపోయింది.. హైదరాబాద్‌లో గెలవడానికి కారణం కేటీఆర్ చేసిన అభివృద్ది.. ప్రతిపక్షాలకు ఓటు బ్యాంక్ లేదు.. ఎండాకాలం వస్తే నిండు కుండల చెరువులు, ప్రాజెక్టులు ఉండే.. కానీ ఇప్పుడు ఎండిపోయినాయి.. మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి రావాలి, ప్రాజెక్టుల్లో నీళ్ళు రావాలి అని ఆయన పేర్కొన్నారు. గెలుపు మనదే.. మళ్లీ గెలిచేది కేసీఆరే అని మాజీ మంత్రి మల్లారెడ్డి తెలిపారు.

నాలో ఏ మాత్రం జోష్ తగ్గలే….
నాలో ఏ మాత్రం జోష్ తగ్గలేదని. మునపటిలానే ఉన్నానని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్, గజ్వేల్ రెండు చోట్ల ఓడిన ఈటల రాజేందర్ మల్కాజ్ గిరిలో ఎలా గెలుస్తాడన్నారు. మల్కాజిగిరిలో మాకు తప్ప ఎవరికీ కేడర్ లేదని తనదైన శైలీలో వ్యాఖ్యానించారు పార్లమెంట్ మల్కాజిగిరిలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని మాజీ మంత్రి జోస్యం చెప్పారు. కాగా, ఇటీవల మలారెడ్డి అల్లుడు, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కాలేజీలు కూలగొట్టడం.. మల్లారెడ్డి 18 యూనివర్శిటీలో, విద్యార్థుల నిరసన వంటి వివాదాలతో మల్లారెడ్డి కాస్త ఇబ్బంది పడ్డాడు. మరోవైపు మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నాడనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ఆ వార్తలకు చెక్ పెట్టారు మల్లారెడ్డి. తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement