Sunday, May 5, 2024

ఎపి ప్ర‌భుత్వ మ‌ద్యం షాపుల‌లో పాత బ్రాండ్ లు

అమరావతి, ఆంధ్రప్రభ: ‘ఎన్నికల ఏడాది. విపక్ష పార్టీలు మద్యంపై రాద్ధాంతం చేసే అవకాశం ఉంది. సున్నిత అంశం కావడంతో ప్రజలు కూడా రాజకీయ విమర్శలను నమ్మే అవ కాశాలు ఉన్నాయి. అందుకు ఏ చిన్న అవకాశం ఇవ్వొద్దు’ అంటూ ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల నుంచి వచ్చిన ఆదేశాల నేపధ్యంలో ప్రభుత్వ మద్యం షాపుల్లో పాత బ్రాండ్లను అందుబాటులోకి తేనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆ దిశగా అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ మద్యం షాపుల్లో దొరికే మద్యం బ్రాండ్లపై ఎప్పటి నుంచో విమర్శలు వెల్లువెతు ్తతున్నాయి. రేట్లు భారీగానే ఉన్నప్పటికీ.. గతంలో దొరికిన బ్రాండ్లతో పోల్చితే ఇవి అంతగా బాగోలేదనేది మద్యం వినియోగ దారుల అభిప్రా యం.

తొలి రోజుల్లోనే విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం పాత బ్రాండ్లను ప్రభుత్వ రిటైల్‌ ఔటులెట్లలో అందు బాటులో ఉంచాలని గతేడాది జనవరిలోనే స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆదేశాలను అధికారులు నామ మాత్రం అమలుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అవికూడా బార్లకు తరలించి ఉద్యోగులు సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వినియోగదారులు పాత బ్రాండ్లపై ఆరా తీస్తే ప్రభుత్వ మద్యం షాపుల్లో లేవనే సమాధానం షరా మామూలైంది. అధికారుల వైఖరితో వినియోగదారులు విధిలేక అధిక రేట్లు వెచ్చించి బార్లలో పాత బ్రాండ్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమం లోనే రానున్న విమర్శలను దృష్టిలో ఉంచుకొని పాత బ్రాం డ్లను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. అయితే ఎప్ప టిలోగా తెస్తారనే దానిపై మాత్రం అధికార వర్గాల నుంచి స్పష్టత లేదు.

ఆ బ్రాండ్లపై విముఖత
ప్రభుత్వ మద్యం షాపుల్లో విక్రయించే బ్రాండ్లపై మద్యం వినియోగదారులు విముఖతతో ఉన్నారు. గతంలో ఎన్నడూ కూడా వినని, చూడని పేర్లతో కూడిన బ్రాండ్లు మద్యం షాపుల్లో అమ్ముతున్నట్లు చెపుతున్నారు. పైగా గతంలో దొరికిన బ్రాండెడ్‌ మద్యంతో పోల్చితే రేట్లు కూడా ఎక్కువేనని చెపుతున్నారు. తొలి నుంచి కూడా ప్రభుత్వ మద్యం షాపుల్లో ఇదే తరహా బ్రాండ్ల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. విధిలేని స్థితిలో మద్యం వ్యసనపరులు దొరికే బ్రాండ్లతోనే సరి పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా రోజువారీ కూలీలు దొరికిన బ్రాండ్లతో సరిపెట్టుకుంటున్నారు. కాస్తోకూస్తో ఆర్థిక స్థితి మంతులు మాత్రం రేటు ఎక్కువైనా పాత బ్రాండ్లను బార్లలో కొనుగోలు చేస్తున్నారు.

పాత బ్రాండ్లకు డిమాండ్‌
ప్రభుత్వ కొత్త మద్యం పాలసీ రాక ముందు చీఫ్‌ (నాసి రకం), ప్రీమియం రకం మద్యం పేరొందిన సంస్థలు సరఫరా చేసేవి. దశాబ్దాలుగా రాష్ట్ర ప్రజలు వాటికి అలవాటుపడ్డారు. ఈ క్రమంలో కొత్త బ్రాండ్ల మద్యం షాపుల్లో దర్శనం ఇవ్వ డంతో తొలుత కొనేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే మద్యం వ్యసనపరులు మాత్రం విధిలేని స్థితిలో వీటిని కొను గోలు చేశారు. అయినప్పటికీ తరుచూ ఏదో ఒక రూపంలో మద్యం వినియోగదారుల నుంచి నిరసనలు రావ డంతో గతేడాది జనవరి నుంచి పాత బ్రాండ్లను అందు బాటులో ఉంచను న్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొద్ది రోజుల పాటు వీటిని విక్రయించినా తదనంతర కాలంలో తిరిగి వాటిని అధికా రులు వదిలేశారు. ఏదో మొక్కుబడిగా నామమాత్రపు సరుకును రిటైల్‌ ఔటులెట్లకు పంపుతున్నారు. ఆ కొద్దిపాటి సరుకును కూడా ఉద్యోగులు బార్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి.

పునరాలోచనలో ప్రభుత్వం
ఎన్నికల ఏడాది కావడంతో ప్రభుత్వం కూడా మద్యం అమ్మకాల విషయంలో ఆచితూచి వ్యవహరించేందుకు నిర్ణ యించుకున్నట్లు తెలిసింది. విపక్ష పార్టీల నుంచి విమర్శలు రావొచ్చనే అభిప్రాయంతో..అందుకు అవకాశం ఇవ్వరాదనే ఉద్దేశంతో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. గతంలో డిజిటల్‌ పేమెంట్లపై విమర్శలు వస్తే అమలుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అయితే అధికారులు ప్రభుత్వ ఆదేశాలను ఏమా త్రం పట్టించుకోకుండా కాలయాపన చేశారు. ఇటీవల ప్రభుత్వం మరోసారి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ఎట్టకేలకు మూడు రోజుల కిందట ఎంపిక చేసిన షాపుల్లో డిజిటల్‌ పేమెంట్లను ప్రారంభించారు. వచ్చే నెలాఖరులోగా అన్ని ప్రభుత్వ మద్యం షాపుల్లో డిజిటల్‌ పేమెంట్లను అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదే క్రమంలో పాత బ్రాండ్లను కూడా తగినంతగా సరఫరా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. గతంలో ప్రతిపక్ష తెదేపా ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యంపై కల్తీ ఆరోపణలు చేసింది. దీంతో ప్రభుత్వం ల్యాబ్‌ల నుంచి నివేదికలు తెప్పించి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ విమర్శలు ఆగకపోవడంతో మద్యం తయారీదారులతోనే వివరణ ఇప్పించారు. ఎన్నికలకు ముందు ఇదే తరహా ఆరోపణలు వస్తే ప్రభుత్వ ప్రతిష్ట మసకబారే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని గతంలో వినియోగదారుల ఆదరణ పొందిన పాత బ్రాండ్ల మద్యం అందుబాటులో ఉంచేందు కు నిర్ణయించారు. తొందరలోనే ప్రభుత్వ మద్యం షాపుల్లో ఆయా బ్రాండ్లు అందుబాటులో ఉంచనున్నట్లు అధికార వర్గాల సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement