Thursday, April 25, 2024

దేవాల‌యాల‌ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి : పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

ఓదెల : దేవాలయాల అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లిఖార్జున స్వామి దేవాలయంలో శ్రీ వీరభద్ర స్వామి- శ్రీ బంగారు పోచమ్మ- శ్రీ మదన పోచమ్మ పున: ప్రతిష్ట- సహిత నూతన పుష్కరిణి ప్రారంభ మహోత్సవంలో ఎమ్మెల్యే దాసరి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దాతలచే నిర్మించే నూతన గృహ వసతి సముదాయానికి ఎమ్మెల్యే దాసరి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తోందని, మల్లన్న ఆలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. నూతన పుష్కరిణి నిర్మాణం పూర్తయితే భక్తులకు పుణ్య స్నానాలు చేసేందుకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. అలాగే నూతన గృహ వసతి సముదాయం నిర్మించేందుకు ముందుకు వచ్చిన దాతలను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మెన్‌ రఘువీర్‌ సింగ్‌, ఎంపీపీ కునారపు రేణుకాదేవి, ఓదెల ఆలయ ఛైర్మెన్‌ మేకల మల్లేశం యాదవ్‌, జడ్పీటీసీ గంట రాములు, మండల పార్టీ అధ్యక్షుడు ఐరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఛైర్మెన్‌ ఆళ్ల శ్రీనివాస్‌ రెడ్డి, రైతు సమితి మండలాధ్యక్షుడు కావటి రాజు, సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు ఆళ్ల రాజిరెడ్డి, ఆకుల మహేందర్‌, ఓదెల ఆలయ ధర్మకర్తలు కనికిరెడ్డి సతీష్‌, అరెల్లి మొండయ్య, కర్రె కుమారస్వామి, మూడెత్తుల శ్రీనివాస్‌, చింతం వెంకటస్వామి, దాసరి రాజయ్య, బత్తుల రమేష్‌, దుగ్యాల నర్సింగరావు, రౌతు స్వర్ణలత, పోసాని శ్రీనివాస్‌, పెగడ రమేష్‌, పరుపాటి నరేందర్‌ రెడ్డి, దూపం వీర భద్రయ్య, అనుబంధ సంఘాల అధ్యక్షులు మ్యాడగొని శ్రీకాంత్‌, మహేష్‌, కుమారస్వామి, పొచెట్టి, గుండేటి మధు, పోతుగంటి రాజు, పోతర్ల శ్రీనివాస్‌, గుర్రం పద్మ, వస్త్రంనాయక్‌, సర్వర్‌, రాజు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్‌లు, బీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు, నాయకులు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement