Sunday, April 28, 2024

నేడు ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు.. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు!

పీఆర్సీ విషయంలో ఉద్యోగుల ఆందోళన ఉధృతం అవుతోంది. ఈ నేపత్యంలో ఇవాళ ఏపీ ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చర్చలు జరుగనున్నాయి. పీఆర్సీ సంబంధించిన అంశాలపై మంత్రుల కమిటీతో చర్చలకు రావాల్సిందిగా పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ నేతలను ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ రోజు(ఫిబ్రవరి 1) మధ్యాహ్నం 12 గంటలకు చర్చలు జరుపనున్నారు. సచివాలయంలో మంత్రుల కమిటీతో హెచ్ఆర్ఏ అంశాలతో పాటు, రికవరీ, అదనపు క్వాంటం పెన్షన్ వంటి అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.

పీఆర్సీ జీవోల్ని వెనక్కి తీసుకోకుంటే సమ్మెకు దిగుతామని ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీస్‌ ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. అయితే, వారితో చర్చించేందుకు కూడా కమిటీ సభ్యులెవరూ ముందుకు రాకపోవడంతో కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు మంగళవారం ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమ చేయాలని భావిస్తోంది. ఈ తరుణంలో ప్రభుత్వం  మరోసారి చర్చలకు ఆహ్వానించింది.

మరోవైపు జనవరి నెల జీతాలను కొత్త వేతన స్కేలు ప్రకారం అమలు చేసిననట్లు ఆర్ధిక శాఖ స్పష‌్టం చేసింది. ఉద్యోగులు, పెన్షనర్‌లు.. తమ పే స్లిప్​లను సీఎఫ్​ఎంఎస్ వెబ్ సైట్‌ ద్వారాగానీ, మొబైల్ యాప్‌ ద్వారాగానీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ప్రతీ ఉద్యోగి మొబైల్ ఫోన్ కు కూడా వేతనానికి సంబంధించిన సంక్షిప్త సమాచారం కూడా పంపామని వెల్లడించింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement