Friday, April 26, 2024

ఏపీలోని స్కూళ్లకు దసర సెలవులు ఎప్పుడంటే..

విద్యార్థులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లోని పాఠశాలలకు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 9 నుంచి 17 వరకు సెలవులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 11 నుంచి 16 వరకు దసరా సెలవులు కాగా…తొమ్మిదో తేదీ రెండో శనివారం, ఆ తర్వాత ఆదివారం రావడంతో అదనంగా సెలవులు వచ్చాయి. కాగా, ఈ నెల 8వ తేదీ వరకే పాఠశాలలు పని చేయనున్నాయి. తిరిగి అక్టోబర్ 18న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.

ఇది కూడా చదవండి: సెంచరీకి చేరువలో డీజిల్ ధరలు.. నేటి రేట్లు ఇలా..

Advertisement

తాజా వార్తలు

Advertisement