Monday, October 18, 2021

సెంచరీకి చేరువలో డీజిల్ ధరలు.. నేటి రేట్లు ఇలా..

దేశీయంగా పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. మంగ‌ళ‌వారం లీటరు పెట్రో‌ల్‌పై 25 పైసలు, డీజి‌ల్‌పై 30 పైస‌లను పెంచిన దేశీయ చమురు మార్కెటింగ్‌ కంపె‌నీలు.. తాజాగా మరోసారి పెంచాయి. బుధవారం పెట్రోల్‌పై 31 పైసలు, డీజిల్‌పై 38 పైసలు పెరిగాయి.

ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర 102.95కు చేరగా.. డీజిల్‌ ధర రూ.91.45కు పెరి‌గింది. అలాగే ముంబైలో పెట్రోల్‌ ధర రూ.108.98‌కు ఎగ‌బా‌కగా, డీజిల్‌ ధర రూ.99.18కి చేరు‌కుంది. తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌ ధర రూ.107.08కి పెరగగా, డీజిల్‌ ధర రూ.99.75కు చేరింది. పెరుగుతున్న పెట్రోల్ ధరల తో వాహన దారులు తమ వాహనాలను బయటికి తీయాలంటే జంకుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News