Tuesday, May 7, 2024

గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్స్ స‌మిట్ లో స్టాల్స్ సూప‌ర్..

విశాఖపట్నం,ప్రభన్యూస్‌: ఆంధ్ర విశ్వకళాపరిషత్‌ ప్రాంగణంలో రెండు రోజుల పాటు కిటకిటలాడిన సందర్శకులతో విజ్ఞాన బాండాగారంగా, రాష్ట్రంలో విజయవంతంగా నడుస్తున్న పరిశ్రమలను ఆవిష్కరిస్తూ జరిగిన తీరు పరిశ్రమల షోకేస్‌గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వివిధ సెక్టార్‌లకు చెందిన పారిశ్రామిక వేత్తల సక్సెస్‌ఫుల్‌ ప్రాజక్టులను ఆవిష్కరించిన తీరుతో ప్రాంగణం మొత్తం ఇంటలెక్చువల్స్‌కు వేదికైంది. ఈ ప్రదర్శన యావత్తూ జరిగిన రెండు రోజుల గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ మీట్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మదిలోని ఏపీ టెక్నాలజీని సమున్నత స్థానంలో నిలపాలన్న ఆశయాన్ని ఆవిష్కరించిన ఈ స్టాల్స్‌ ఒకదీనికి మరొకటి పోటీపడ్డట్టుగా ఉన్నాయి. మొత్తానికీ సమగ్రంగా పరిశీలించి ప్రతి సందర్శకులూ విద్యార్ధి అవతారం ఎత్తి ఒక్కో స్టాల్‌ వద్దా సమగ్రంగా సంబంధిత పరిశ్రమకు చెందిన సమాచారం తెలుసుకుని సంబంధిత ప్రతినిధితో చర్చించడం కనిపించింది. కొత్త విషయాలను నోట్‌బుక్‌లో రాసుకోవడం కూడా కనిపించింది. ఈ నేపద్యంలో ఆద్యంతం ప్రతి స్టాల్‌ వద్దా పెద్ద ఎత్తున గుమిగూడిన సందర్శకులలొ విద్యావంతులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ప్రత్యేక ప్రజెటేషన్స్‌ ప్రక్రియల కు సందర్శకులంతా ఫిదా అయిపోయారు.

పర్యాటక రంగానికి పెద్ద పీట వేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అభివృద్ధి చేసిన హెర్టేజ్‌ అండ్‌ కల్చర్‌ స్టాల్‌ ఆకట్టుకుంది. లేపాక్షి, విజయనగరం పోర్టు, చంద్రగిరి, గండికోట ఫోర్టు, ఎండవల్లి, కొండారెడ్డి బురుజు, కేతవరం రాక్‌ పెయింటింగ్‌లు, పెనుగొండ బురుజు, అమరావతి మహా స్ఫూపం, కొండపల్లి కోట, కొండవీడు కోట, బొర్రా గుహలు, బెలం గుహలు తదితరాల వివరాలతో కూడిన స్టాల్‌ ఆకట్టుకుంది. హిందుస్థాన్‌ షిప్‌యార్డు లిమిటెడ్‌ (హెచ్‌ఎస్‌ఎల్‌) స్టాల్‌లో 81 సంవత్సరాలుగా తన ప్రస్థానంను కొనసాగిస్తూ 200 క్వాలిటీ షిప్‌ల నిర్మాణం, 2000 షిప్‌ రిపేర్లను పూర్తి చేసుకుని, 5 సబ్‌మెరిన్‌లను రీఫిట్టింగ్‌ చేసిన ఘనతను చాటింది. మౌరి టెక్‌ గ్లోబల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సొల్యూషన్స్‌ ప్రొవైడర్‌ సంస్థ 2005లో ప్రారంభమై 14 కార్యాలయాలతో 5 వేలు పైచిలుకు విశ్వవ్యాప్త అసోసియేట్స్‌తో, 350 సంతృప్తికర కస్టమర్స్‌తో సాగుతూన్నట్లుగ శైలజ గుడాల వెళ్లడించారు. జైత్ర డాటా ఫౌండ్రీ సంస్థ తరపున ఎడ్జ్‌ కంప్యూటింగ్‌, మెడికల్‌ ఇమేజింగ్‌, ఏడీఆర్‌ మోడల్స్‌, ఎన్‌ఎల్‌పీ/టెక్స్ట్‌ మైనింగ్‌, ఓడీఎం సర్వీసెస్‌ తదితర రంగాల్లో తమ నైపుణ్యతను ఆవిష్కరించారు. టాటా సోలార్‌ రూఫ్‌ ప్రాజక్టు తరపున డైరెక్టర్‌ దేవరాపల్లి సతీష్‌ సోలార్‌ పవర్‌ ప్రాముఖ్యతను వివరించారు. అంతర్జాతీయంగా ఉన్న సోలార్‌ పవర్‌ ప్రాజక్టు కస్టమర్స్‌తో కూడిన ప్రెజెంటేషన్‌ను ఆవిష్కరించారు. బిల్డింగ్‌ డిజిటల్‌ నేటివ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో 2008లో ప్రారంభించిన సంస్థతో వెయ్యి మంది ఉద్యోగులు, 900 డిజిటల్‌ ఉత్పత్తులతో కూడిన గేమింగ్‌ యాప్స్‌, ఈ కామర్స్‌, ఎంటర్‌ప్రైజెస్‌ యాప్స్‌, ఫైనాన్సియల్‌ యాప్స్‌, క్రాస్‌ ప్లాట్‌ఫాం యాప్స్‌, తో పాటూ స్మార్టు డివైజ్‌, స్మార్టు హోమ్స్‌, కనెక్టడ్‌ మెషినరీ, క్లౌడ్‌ కనెక్టివిటీతో కూడిన డివైజ్‌, కనె క్టడ్‌ ఫామ్స్‌, స్మార్టు హెల్త్‌కేర్‌, బ్లాక్‌ చైన్‌ అండ్‌ క్రిఎ్టోకు చెందిన 20 ప్రాజక్టులు, మెటావెర్స్‌కు చెందిన 15కి పైగా ప్రాజక్టులూ, 80కు పైగా ఉన్న గేమ్స్‌ మరియు గేమిఫికేషన్‌ తదితర టెక్నాలజీలతో కూడిన అంశాలను ఆవిష్కరించారు. స్కిల్స్‌ ఇండియా ప్రాజక్టుకు సంబంధించి రిజిస్ట్రేషన్‌, రాష్ట్రస్థాయి పోటీలు, ప్రాంతీయ స్కిల్‌ పోటీలు, జాతీయ స్థాయి పోటీలు, శిక్షణ, తదితరాలతో కూడిన వరల్డ్‌ స్కిల్స్‌ ఇండియా సంస్థ స్టాల్‌లో వివరించారు. రిసెర్గంట్‌ అండ్‌ రీసెల్యూషన్‌ ప్రొఫెషనల్స్‌ సంస్థ తరపుఉన జ్యోతి ప్రకాష్‌ గడియా, సుధీర్‌ గండి, తదితరుల ఆధ్వర్యంలోని ఇనసాల్వెన్సీపేరుతో ఏర్పాటు చేసిన స్టాల్‌, ఎర్బా కెమ్‌కు సంబంధఙంచిన టాన్సేసియా కంపెనీ క్లినికల్‌ కెమిస్ట్రీ ఎనలైజర్‌ సంస్థ చిన్న వర్కులోడ్‌ లేబరేటరీస్‌కు సంబంధించిన అంశాలు, ఫుడ్‌ ప్రోసెసింగ్‌ సొసైటీ తరపున మెగా ఫుడ్‌ ప్రోసెసింగ్‌ యూనిట్స్‌కు సంబంధించిన స్టాల్‌, స్మార్టు సిటీ సొల్యూషన్స్‌ పేరుతో ఎడాప్టివ్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిస్టమ్స్‌, స్మార్టు ఎన్విరాన్‌మెంట్‌, ట్రాఫిక్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ సిస్టమ్‌, స్మార్టు వాటర్‌, ఇంటెలిజెంట్‌ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్‌ తదితరాలను విష్కరించారు.

అలాగే రైతు సాధికార సంస్త సౌజన్యంతో మన్యం ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్‌ పేరుతో ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ మార్కెట్‌ విభాగం ఏర్పాటు చేసిన స్టాల్‌ ఆకట్టుకుంది. బియ్యం, రవ్వ, తీపి-ఉపు, కానుగ నూనెలు, చిక్కుళ్లు, మిద్దె తోట తదితర అంశాలను వివరించారు. విశాకపట్నం చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌కు సంబంధించిన స్టాల్‌లో పొందుపరిచి వివరించిన అంశాలు పలువురిని ఆకట్టుకున్నాయి. రాష్ట్ర విపత్తుల రెస్పాన్స్‌, ఫైర్‌ సర్వీసెస్‌ స్టాల్‌ , వెంచర్‌ ఆఫ్‌ షోర్‌ పేరుతో వ్యాపారాన్ని నెక్స్టు లెవెల్‌కు తీసుకు వెళ్లే స్టాల్‌ యువతను ఆకట్టుకుంది. కాకినాడ కంటైనర్‌ టెర్మినల్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ డోర్‌ స్టెప్‌ వద్దగే ఉన్న తీరుని ఆవిష్కరిస్తూ కాకినాడ గేట్‌వే పోర్టు కు సంబంధించిన స్టాల్‌ వివరాల వద్ద , ఆరో ఇండస్ట్రియల్‌ సిటీ సమాచారం తెలుసుకోవడంలో అత్యధికులు ఆసక్తిని కనబరిచారు. సుక్షమ గామా స్టాల్‌ వద్ద గుమికూడిన సందర్శకులు త్రీడీ ప్రింటింగ్‌ మేన్యుఫేక్చరింగ్‌ఒ, ఎలక్ట్రిక్‌ వెహికల్‌ చార్జింగ్‌ సొల్యూషన్స్‌, ట్రూ రిఫ్లెక్సు అంటూ ఈపీ స్టాల్స్‌ ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన లేపాక్షి స్టాల్‌ సందర్శకులను కట్టిపడేసింది.

తాటకుతో చేసిన బొమ్మలూ, బుట్టలూ, ఆదివాసి పెయింటింగ్‌లు, బ్రాస్‌ వేర్‌ , వెదురు బొంగులుతో చేసినవీ, టెర్రాకోట్‌ మట్టి ఆకృతులూ, కొండపల్లి బొమ్మలు, కళంకారీ పెయింటింగ్లు, సంగీత వాద్యాలు, వుడ్‌ కార్వింగ్‌ (చెక్కను బొమ్మలుగా చెక్కినవి, లేస్‌లతో కూడినవి, ఇక్కడ చోటు చేసుకున్నాయి. సస్టైనబులిటీని ఆవిష్కరిస్తూ సెమ్బ్‌కోర్ప్‌ ఎనర్జీ సొల్యూషన్స్‌ తదితర అంశాలూ, రోబోటిక్స్‌, తదితర స్టాల్స్‌ కూడా విద్యార్ధులూ, మేధావులూ, పారిశ్రామిక వేత్తలూ, ఔత్సాహిక వ్యాణిజ్య వేత్తలు స్వయంగా తెలుసుకోవడం వివరాలను నమోదు చేసుకోవడం కనిపించింది. మొత్తానికి రెండు రోజుల పాటు గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ మీట 2023లో ఈ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ మంచి స్పందనను పొందాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement