Thursday, May 2, 2024

AP: ఏపీలో ఎన్నికల నగారా.. మిగ‌తా జీపీలు, మున్సిపాలిటీల‌కు షెడ్యూల్ రిలీజ్‌

AP : ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఎన్నికల నగారా మోగింది. మిగిలిపోయిన గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాల్టీలు, కార్పొరేషన్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 3 నుంచి 5 వ తేదీ వరకు నామినేషన్లను స్వీక‌రించ‌నున్న‌ట్టు ఈసీ ప్ర‌క‌టించింది. నవంబర్ 14న పంచాయతీ ఎన్నికల పోలింగ్, నవంబర్ 15 మున్సిపల్ పోలింగ్, నవంబర్ 16 ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ ఉంటుంది. నెల్లూరు కార్పొరేషన్ స‌హా.. 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. అందులో కుప్పం కూడా ఉంది.

కోర్టు కేసులు, ఇత‌ర‌ కారణాలతో గ‌తంలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. వాటికి సంబంధించి ఈసీ తాజాగా కసరత్తు చేస్తోంది. స్థానిక ఎన్నికలకు సంబంధించి ఈ నెల 3న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. అలాగే 15న ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఏపీలోని నెల్లూరు కార్పొరేషన్‌తో పాటూ.. మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో కృష్ణాజిల్లాలోని ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి ఉన్నాయి. గుంటూరు జిల్లాలో దాచేపల్లి, గురజాల, ప్రకాశం జిల్లాలో దర్శి, నెల్లూరు జిల్లాలో బుచ్చిరెడ్డి పాలెం, చిత్తూరు జిల్లాలో కుప్పంలో ఎన్నికలు జరుగుతాయి. కడప జిల్లాలో కమలాపురం, రాజంపేట, అనంతపురం జిల్లాలో పెనుకొండలో ఎన్నికలు జరుగుతాయి.

14 న పంచాయతీ పోలింగ్.. అదే రోజు కౌంటింగ్

15 న మున్సిపల్ ఎన్నికల పోలింగ్..17 న కౌంటింగ్

- Advertisement -

16 న ఎంపిటిసి, జెడ్పీటీసీ పోలింగ్..18 కౌంటింగ్

ఎన్నికలు జరుగనున్న గ్రామపంచాయతీలుః

13 జిల్లాల్లో 69 సర్పంచ్ ,533 వార్డులకు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

శ్రీకాకుళం జిల్లాః 12 సర్పంచ్..40 వార్డులు

విజయనగరంః 4 సర్పంచ్..38 వార్డులు

విశాఖః 6 సర్పంచ్..71 వార్డులు

తూర్పుగోదావరిః 6 సర్పంచ్..47 వార్డులు

పశ్చిమ గోదావరిః 4 సర్పంచ్..47 వార్డులు

కృష్ణాః 5 సర్పంచ్..41 వార్డులు

గుంటూరుః 10 సర్పంచ్..32 వార్డులు

ప్రకాశంః 4 సర్పంచ్..46 వార్డులు

నెల్లూరుః 2 సర్పంచ్..37 వార్డులు..

చిత్తూరుః 6 సర్పంచ్..44 వార్డులు

కడపః 3 సర్పంచ్..38 వార్డులు

అనంతపురంః 4 సర్పంచ్..31 వార్డులు

కర్నూలుః 3 సర్పంచ్..21 వార్డులు

Advertisement

తాజా వార్తలు

Advertisement