Sunday, May 5, 2024

ఏపీకి మూడు రాజధానులు అవసరం లేదు – కేంద్ర మంత్రి మురళీధరన్

ఏపీకి మూడు రాజధానులు అవసరం లేదని చెప్పారు కేంద్ర మంత్రి మురళీధరన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు బీజేపీ ఎప్పటికీ మద్దతివ్వదని తేల్చి చెప్పారు. శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ…వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు మంత్రం జపిస్తున్నా.. ఇప్పటి వరకు ప్రజల నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు కదా.. అని ఆయన ఎదురు ప్రశ్నించారు. అంతేకాదు.. మూడు వల్ల వచ్చే ప్రయోజనాలు కూడా ఉండవని తేల్చి చెప్పారు. వైసీపీకి విశాఖపై ఏమీ ప్రేమ లేదన్నకేంద్ర మంత్రి.. విశాఖను దోచుకోవడానికే వైసీపీ పన్నాగం వేసిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖలో భూముల ధరలకు భారీ డిమాండ్ ఉండడంతోనే వైసీపీ అధినేతకు ఆ పార్టీ నాయకులకు ఈ ప్రాంతపై కన్ను పడిందన్నారు. విశాఖ అభివృద్ధి చెందే ఉందని…కొత్తగా అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదని తెలిపారు.

అమరావతిలో రాజధాని నిర్మాణానికి ప్రధానమంత్రి మోడీ నాంది పలికారన్నారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ రూ.7500 కోట్లు కేటాయించిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశానికి ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. కుటుంబ పాలన నాయకత్వంతో ఏపీలో టీడీపీ వైసీపీ దోచుకుతింటున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు కూడా స్టిక్కర్లను మార్చి ఏపీ పథకాలుగా వైసీపీ నాయకులు చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఏపీలో ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా బీజేపీ రాజిలేని పోరాటం చేస్తుందని మురళీధరన్ స్పష్టం చేశారు. రాజధాని రైతులుచేస్తున్న పాదయాత్రపై స్పందిస్తూ.. సుదీర్ఘ కాలంగా వారు చేస్తున్న పాదయాత్రపై ముఖ్యమంత్రి జగన్ స్పందించి ఉంటే బాగుండేదని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement