Friday, April 26, 2024

ఎంపీ రఘురామకి ఏపీ సీఐడీ కౌంటర్!

ఏపీ సీఐడీ వద్ద ఉన్న తన మొబైల్ నుంచి పలవురికి మెసేజ్‌ వెళ్తున్నాయని నరసాపురం ఎంపీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ సీఐడీ అధికారులు స్పందించారు.  ఢిల్లీ పోలీసులకు రఘురామకృష్ణం రాజు మొబైల్ ఫోన్ గురించి తెలిపిన వివరాలు సరైనవి కావని తెలిపారు. రఘురామను అరెస్ట్ చేసినప్పుడు అతని ఐ ఫోన్ 11 ప్రోమాక్స్, ఎయిర్ టెల్ సిమ్ సీజ్ చేశామని చెప్పారు. సీజర్ మెమో కూడా తయారు చేశామని, ఇద్దరు సాక్షుల ఎదుట రఘురాం ఫోన్ సిల్ వేశామన్నారు. సీజ్ కి సంబందించిన రిపోర్ట్ సిఐడి కోర్టు మేజిస్ట్రేట్ కి అందజేసినట్లు చెప్పారు. సీల్డ్ కవర్ ను ఏపీ ఎఫ్ఎస్ఎల్ కు మే 18న ప్రాథమిక పరిశీలనకు పంపిచినట్లు వివరించారు. ఎఫ్ఎస్ఎల్ వద్దనున్న ప్రతి రిపోర్టు కోర్టుకు అందించామన్నారు. రఘురామకృష్ణం రాజు ఢీల్లీ పోలీసులకు ఇచ్చిన రిపోర్టులో 900092233 నెంబర్ తెలిపారన్నారు. అయితే, ఏపీ సీఐడీ సీజ్ చేసిన ఫోన్ నెంబర్ 9000911111 అని తెలిపారు. ఏపీ ఎఫెసెల్ వద్ద రఘురామ ఫోన్ కు ఏపీ సిఐడికి సంబంధం లేదన్నారు. సీఐడీ విచారణను తప్పుదోవ పట్టించేందుకు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు. ఈ మొత్తం సమాచారం సుప్రీంకోర్టు ముందు ఉంచాలన్నారు. సీఐడీ విచారణ న్యాయ బద్దంగా జరుగుతుందని స్పష్టం చేశారు. బయట వస్తున్న ఆరోపణలు నిరాదరం, అసత్యం అని ఏపీ సీఐడీ స్పష్టం చేసింది.

కాగా, ఏపీ సీఐడీ అదనపు డైరెక్టర్ జనరల్ సునీల్ కుమార్ పై ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ కు శనివారం(జూన్ 5) రఘురామ ఫిర్యాదు చేశారు. మే14న తనను అరెస్ట్ చేసినప్పుడు తన నుంచి ఐఫోన్ తీసుకున్నారని, ఇంతవరకు తిరిగివ్వలేదని తన ఫిర్యాదులో ఆరోపించారు. స్వాధీనం చేసుకున్న ఫోన్ లో 90009 11111 నెంబరుతో వాట్సాప్ ఖాతా ఉందని వివరించారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల జాబితాలో ఫోన్ ను చేర్చలేదంటూ లీగల్ నోటీసు ఇచ్చానని ఢిల్లీ డీసీపీకి తెలిపారు.

గత నెల 14వ తేదీ రాత్రి సునీల్ కుమార్ సహా నలుగురు తనను తీవ్రంగా కొట్టారని ఆరోపించారు. తర్వాత మరో వ్యక్తి తన ఛాతీపై కూర్చుని ఫోన్ లాక్ తెరవాలని ఒత్తిడి చేశారని చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాణరక్షణ కోసం ఫోన్ లాక్ ఓపెన్ చేసినట్టు ఫిర్యాదులో వివరించారు. మాజీ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేష్‌, కుటుంబ సభ్యులకు తన వాట్సాప్‌ నెంబర్‌ నుంచి పలుమార్లు మెసేజ్‌లు పంపారని ఆరోపించారు. ప్రభుత్వ సేవకుడే చట్టాలను ఉల్లంఘించి నేరపూరితంగా వ్యవహరించారని అని అన్నారు. సునీల్‌కుమార్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రఘురామ విజ్ఞప్తి చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement