Saturday, May 18, 2024

AP Cabinet – వరాల జల్లు.. పెన్ష‌న్ రూ3 వేల‌కు పెంపు … ఎన్నికల షెడ్యూల్ ముందే రావచ్చన్న జగన్ …

విశాఖపట్నానికి ఏపీ కేబినేట్ వరం ఇచ్చింది. మెట్రో రైలుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో విశాఖపట్టణం రాజధాని కాబోతోందనే ఆశలు వెల్లివిరుస్తున్నాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనేక సంక్షేమ పథకాల లబ్దిదారులకు శుభవార్త తెలిపారు. కాబోయే రాజధాని వైజాగ్ లో లైట్ మెట్రోకు కూడా మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దీంతో పాటు వచ్చే నెలలో అమలు చేయాల్సిన పలు సంక్షేమ పథకాలకు జగన్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కేబినేట్ భేటీలో జగన్ ఎన్నికల షెడ్యూల్ పై ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు.. ఈసారి ఎలక్షన్ షెడ్యూల్ 20 రోజులు ముందే రావచ్చని, అందరూ సిద్ధంగా ఉండాలని మంత్రులను కోరారు.

వైఎస్సార్ ఆరోగ్యశ్రీ లో ఉచిత చికిత్సల పరిమితిని రూ. 25 లక్షలకు పెంచడానికి కేబినెట్ ఆమోదించింది. ఇప్పటి వరకూ రూ. 5 లక్షలుగాఉన్న వైద్య ఖర్చుల పరిమితిని ఏకంగా ఐదు రెట్లు పెంచి రూ. 25 లక్షలకు తీసుకెళ్లే నిర్ణయానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ నెల 18న రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ లబ్దిదారులకు కొత్త కార్డుల్ని ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో పరిమితి కూడా పెరగడం ఊరట కలుగుతుంది. ఆరోగ్య సురక్ష రెండో విడత కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. జనవరి 1 నుంచి ఈ పథకం అమలు చేస్తారు. జనవరి లో అమలు చేసే ఇతర పథకాలు వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూతకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో సామాజిక పెన్షన్ లను ప్రస్తుతం ఉన్న రూ.2750 నుంచి రూ.3000కు పెంచేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాష్ర్టంలో 65 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement