Sunday, April 28, 2024

AP : కాంగ్రెస్‌లోకి మరో వైసిపి ఎమ్మెల్యే….

వైసిపి నుంచి మ‌రో ఎమ్మెల్యే జంప్ అయ్యారు. పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆ పార్టీని వీడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో టికెట్‌ను ఆయన స్థానంలో విప్పర్తి వేణుగోపాల్‌కు వైకాపా కేటాయించింది.

- Advertisement -

అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్న చిట్టిబాబు నేడు పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. వైఎస్‌ఆర్‌ జిల్లా ముద్దనూరులో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆయనకు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement