Tuesday, December 3, 2024

AP: వైభవంగా సత్తమ్మ తల్లి వార్షిక జాతర… వేలాదిగా తరలివచ్చిన భక్తులు

సింహాచలం, మార్చి 14 : సింహాద్రినాధుడి సోదరి, 14 గ్రామాల ప్రజల పొలిమేర దేవత శ్రీ సత్తమ్మతల్లి వార్షిక జాతర గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతీ ఏటా మార్చి 14న అమ్మవారి పుట్టినరోజును పురస్కరించుకొని వార్షిక జాతరను గత కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే తెల్లవారుజామున అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ఆరాధన గావించారు. అనంతరం సర్వాభరణాలుతో అందంగా అలంకరించారు. అనంతరం వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. తెల్లవారుజాము నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని పసుపు, కుంకమలు సమర్పించుకున్నారు. ముడుపులు, మొక్కుబడులు చెల్లించుకున్నారు. పలు స్వచ్చంద సంస్థల సహకారంతో ఆలయ కమిటి భక్తులకు ప్రసాద వితరణ, అన్నసమారాధన పెద్ద ఎత్తున నిర్వహించింది. సాయంత్రం భారీగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, అధ్యక్షులు పి.వెంకటరావు , కమిటీ సభ్యులు గంట్ల కనకరాజు, బలిరెడ్డి శ్రీనివాసరావు, తదితరులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి ఆలయాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. పెద్దఎత్తున పూల, విద్యుత్ అలంకరణలు చేశారు.


ఆలయ అభివృద్ధికి సహకరించండిః

అమ్మవారిని సింహాచలం దేవస్థానం ఈఓ సింగం శ్రీనివాసమూర్తి దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఈఓను ఘనంగా సత్కరించింది. అప్పన్న సోదరిగా విరాజిల్లుతున్న సత్తమ్మతల్లి ఆలయ అభివృద్ధికి సింహాచలం దేవస్థానం తరపున సహకరించాలని ఈ సందర్భంగా ఆలయ కమిటి ఈఓను కోరింది. ఇందుకు ఈఓ సానుకూలంగా స్పందించారు. తమ పరిధి మేరకు ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తామన్నారు. స్థానిక కార్పొరేటర్ రాపర్తి కన్నా, పలువురు ప్రజాప్రతినిధులు, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.

- Advertisement -

భక్తుల సౌకర్యార్థం వాటర్ డిస్పెన్సరీలు విరాళం

సౌత్ ఇండియా వస్త్ర సంస్థ 25మిషిన్లు పలు ప్రాంతాల్లో ప్రారంభం…

రాష్ట్రంలోని ప్రముఖ వస్త్ర వ్యాపారం సంస్థలు ఆర్ ఎస్ బ్రదర్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సంయుక్తంగా 25 వాటర్ కూల్ అండ్ హాట్ వాటర్ మిషన్స్ దేవస్థానానికి విరాళంగా సమర్పించారు. ఈఓ ఎస్.శ్రీనివాసమూర్తి, ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీను బాబు, దినేష్ రాజ్ తదితరులు వీటిని గురువారం ప్రారంభించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు నడయాడే పలు ప్రదేశాల్లో వీటిని అందుబాటులో పెట్టారు. వీటి ఏర్పాటుతో భక్తులకు మంచినీటి సమస్యలు తీరనున్నాయి. ఈ కార్యక్రమంలో స్థానాచార్యులు డాక్టర్ టి పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ప్రత్యేక ఆహ్వానితులు నరసింహ మూర్తి, ఈఈ లు శ్రీనివాసరాజు, రాంబాబు, ఏఈఓ లు బ్రమరారంభ, నరసింగరావు రమణమూర్తితో పాటు పి అర్ ఓ దమ్ము అప్పలనాయుడు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానంలో ఈనెల 26నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగనున్న వేద హవనం పూర్వక పాంచాహ్నినిక పంచకుండాత్మక శ్రీ సుదర్శన నారసింహ మహాయజ్ఞం ఏర్పాట్లకు సంబంధించిన ధర్మకర్తల మండలి సభ్యులు, దేవస్ధానం విభాగాధిపతులతో ఈఓ ఎస్.శ్రీనివాసమూర్తి గురువారం సమావేశమై చర్చించారు. యజ్ఞంలో భక్తులను పెద్ద సంఖ్యలో భాగస్వాములను చేయడానికి ప్రతిఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు. యజ్ఞంలో పాల్గొనే ఉభయ దాతలు వారితో పాటు వచ్చే కుటుంబ సభ్యులకు కల్పించే సదుపాయాలపై చర్చించారు. అనంతరం వీరంతా వెళ్లి యజ్ఞశాలను పరిశీలించారు. హోమ గుండాలు ఏర్పాటు, భక్తులు ఆశీనులను చేసే ప్రదేశాలను వైదికులు వివరించి చెప్పారు. పాంచాహ్నిక దీక్షతో జరిగే యజ్ఞంలో ప్రతీరోజూ సాయంత్రం స్వామివారి వాహన సేవలు నిర్వహించనున్నట్లు స్థానాచార్యులు, ప్రధానార్చకులు ప్రకటించారు. రోజుకో వాహనంలో స్వామి సింహగిరి వీధుల్లో విహరించనున్నట్లు తెలియజేశారు. తిరువీధుల్లో స్వామివారికి ముందు కోలాటాలు, భజనలు ఏర్పాటు చేయనున్నట్టు ఈఓ చెప్పారు.

లోక కళ్యాణం కోసమే సుదర్శన నారసింహ మహా యజ్ఞం…

శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానంలో ఈనెల 26 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగనున్న వేద హవనం పూర్వక పాంచాహ్నినిక పంచకుండాత్మక శ్రీ సుదర్శన నారసింహ మహాయజ్ఞం ఏర్పాట్లకు సంబంధించిన ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు, దినేష్ రాజ్, ఆహ్వానితులు నరసింహ మూర్తి, దేవస్ధానం విభాగాధిపతులతో ఈఓ ఎస్.శ్రీనివాసమూర్తి గురువారం సమావేశమై చర్చించారు. యజ్ఞంలో భక్తులను పెద్దసంఖ్యలో భాగస్వాములను చేయడానికి ప్రతిఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు. యజ్ఞంలో పాల్గొనే ఉభయ దాతలు వారితో పాటు వచ్చే కుటుంబ సభ్యులకు కల్పించే సదుపాయాల పై చర్చించారు. అనంతరం వీరంతా వెళ్లి యజ్ఞశాలను పరిశీలించారు. హోమ కుండాలు ఏర్పాటు, భక్తులు ఆశీనులను చేసే ప్రదేశాలను వైదికులు వివరించి చెప్పారు. పాంచాహ్నిక దీక్షతో జరిగే యజ్ఞంలో ప్రతీరోజూ సాయంత్రం స్వామివారి వాహన సేవలు నిర్వహించనున్నట్లు స్థానాచార్యులు, ప్రధానార్చకులు ప్రకటించారు. రోజుకో వాహనంలో స్వామి సింహగిరి వీధుల్లో విహరించనున్నట్లు తెలియజేశారు. తిరువీధుల్లో స్వామివారికి ముందు కోలాటాలు, భజనలు ఏర్పాటు చేయనున్నట్టు ఈఓ చెప్పారు. యాగంలో పాల్గొనే భక్తులతో పాటు విరాళాలు అందించే దాతలకు పెద్ద పీట వేయాలని సమావేశంలో నిర్ణయించారు. దాతల విరాళాలకు జవాబుదారీతనం ఉంచడంతో పాటు బాధ్యతను మరింత పెంచేందుకు ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేశామని ఈఓ చెప్పారు.

ప్రసాద్ పధకంతో సింహగిరి దేదీప్యమానము..

కేంద్రం మంజూరు చేసిన ప్రసాద్ పధకంతో సింహగిరిపై అనేక సదుపాయాలు భక్తులకు అందుబాటులోకి రానున్నట్లు ఆలయ ఈఓ ఎస్.శ్రీనివాస్ మూర్తి తెలిపారు. రూ.54 కోట్లతో అనేక ప్రాజెక్ట్ ల నిర్మాణాలు ప్రారంభించడం జరిగిందన్నారు.. ఇందుకు సంబందించిన శిలాఫలకం గురువారం ఈఓ, ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు, దినేష్ రాజ్, ప్రత్యేక ఆహ్వానితులు నరసింహ మూర్తి, అర్చకులు, అధికారులు ఆవిష్కరించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement