Friday, April 26, 2024

Andhra Pradesh – ఈసీ దూత‌లు వ‌స్తున్నారు.. ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు

అమరావతి, ఆంధ్రప్రభ : ఏపీలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను భారత ఎన్నిక సంఘం నియమించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. 1987 బ్యాచ్ కి చెందిన రిటైర్డు ఐ.ఏ.ఎస్. అధికారి రామ్ మోహన్ మిశ్రాను స్పెషల్ జనరల్ అబ్జర్వరుగా, 1984 బ్యాచ్ కి చెందిన రిటైర్డు ఐపీఎస్. అధికారి దీపక్ మిశ్రాను స్పెషల్ పోలీస్ అబ్జర్వరుగా, 1983 బ్యాక్ కి చెందిన రిటైర్డు ఐఆర్ఎస్. అధికారి నీనా నిగమ్ ను ప్రత్యేక వ్యయ పరిశీలకులుగా నియమించినట్లు ఎన్నికల కమిషన్ నుంచి సమాచారం వచ్చినట్టు ఆయన తెలిపారు. ఈ ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు నేడు భారత ఎన్నికల సంఘం కార్యాలయంలో జరిగే సమావేశానికి హాజరవుతున్నారన్నారు. ఈ ముగ్గురు రాష్ట్ర పత్యేక పరిశీలకులు వచ్చే వారం నుంచి రాష్ట్రంలో పర్యటిస్తారని, ఎన్నికల నిర్వహణకు రాష్ట్రంలో చేపట్టిన ముందస్తు ఏర్పాట్లను పరిశీలిస్తారన్నారు.

మార్గ‌ద‌ర్శ‌కాలు పాటించాలి..

ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పటిష్టంగా అమలు పర్చే అంశం, రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు, సమస్యాత్మకమైన ప్రాంతాలతో పాటు ఓటర్లను ఆకర్షించే, ప్రేరేపించే తాయిలాల నియంత్రణపై కూడా వీరు ప్రత్యేక దృష్టిని సారించనున్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, లా ఎన్ ఫోర్సుమెంట్ ఏజన్సీలతో ఎన్నికల సంఘం నిర్వహించే సమావేశాల్లో ఈ పరిశీలకులు పాల్గొని, తమ అనుభవాలను, సూచలను, సలహాలను ఇస్తారని ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement