Friday, April 26, 2024

తెలంగాణపై మరోసారి కేఆర్ఎంబీకి ఏపీ ఫిర్యాదు

కృష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన వివాదం తీవ్రతరం అవుతోంది. నిత్యం ఇరు రాష్ట్రాలు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా శ్రీశైలం జలాశయంలో తెలంగాణ విద్యుదుత్పత్తి చేయడంపై ఏపీ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు మరోమారు ఫిర్యాదు చేసింది. అక్రమంగా విద్యుదుత్పత్తి చేస్తోందని ఆరోపిస్తూ లేఖ రాసింది. టీఎస్ జెన్ కో వెంటనే విద్యుదుత్పత్తిని నిలిపేసేలా ఆదేశాలివ్వాలని లేఖలో కోరింది. ఉమ్మడి ప్రాజెక్టుల విషయంలో సాగు, తాగు నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ ను ఉత్పత్తి చేయాలని పేర్కొంది. పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి చేసే హక్కు తమకుందన్న తెలంగాణ వాదన పూర్తి అసంబద్ధంగా ఉందని పేర్కొన్నారు. శ్రీశైలం బేసిన్ లో పరిస్థితులను వివరిస్తూ ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి లేఖ రాశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement