Tuesday, June 18, 2024

రైలు కింద పడి విద్యార్థి ఆత్మహత్య

తాడిపత్రి రూరల్ : అనంతపురం జిల్లా పుట్లూరు మండలం సీ.వెంగన్నపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు సంఘటన వివరాలిలా ఉన్నాయి. పుట్లూరు మండలానికి చెందిన పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో మళ్లీ ఇటీవల జరిగిన సప్లిమెంటరీ పరీక్షలు రాశాడు. అయితే ఈ సప్లిమెంటరీ పరీక్షల్లో కూడా మళ్లీ తప్పాడు. దీంతో మనస్తాపానికి గురయిన యువ‌కుడు గురువారం అర్ధరాత్రి దాటాక తాడిపత్రి శివారులోని రైల్వే ట్రాక్ పై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని శుక్రవారం ఉదయం రైల్వే పోలీసులు గుర్తించారు. ఈ మేరకు విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సంఘటన కు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement