Saturday, December 7, 2024

AP : ఇవాళ అనంత‌పురంలో మేమంతా సిద్ధం

సీఎం జ‌గ‌న్ చేప‌ట్టిన మేమంతా సిద్ధం బ‌స్సుయాత్ర ఇవాళ్టికి నాలుగో రోజుకు చేరుకుంది. నేడు కర్నూలు జిల్లాలో నుంచి అనంతపురంలోకి ప్రవేశించనుంది. ఉదయం పత్తికొండలోని రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయల్దేరనున్న సీఎం జగన్‌.. రాతన మీదుగా తుగ్గలి చేరుకుంటారు.

- Advertisement -

ఈ సంద‌ర్భంగా గ్రామస్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం జొన్నగిరి మీదుగా గుత్తిలోకి ప్రవేశించనుంది.. గుత్తి శివారులో భోజనవిరామం ఉంటుంది.. మళ్లీ మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి.. పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్, రాప్తాడు బైపాస్, ఆకుతోటపల్లి, సంజీవపురం శివారు వరకు బస్ యాత్ర కొనసాగుతుంది. సంజీవపురం శివారులో రాత్రి బస చేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్​.

Advertisement

తాజా వార్తలు

Advertisement