Sunday, April 14, 2024

KNL: రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

మంత్రాలయం, ఆగస్టు 26 (ప్రభ న్యూస్): మండలంలోని తుంగభద్ర రైల్వే స్టేషన్‌ లో పట్టాల మధ్య గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. రైల్వే పోలీసుల సమాచారం మేరకు మృతుడు సుమారు 36 సంవత్సరాల వయస్సు కలిగి ఉంటాడని, ఇతనికి సంబంధించిన ఆధారాలు ఏమీ దొరకలేదన్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement