Monday, October 14, 2024

NLG: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి.. ఎమ్మెల్యే కూసుకుంట్ల

చౌటుప్పల్, ఆగస్టు 26 (ప్రభ న్యూస్) : పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. చౌటుప్పల్ పట్టణంలోని వెంకటరమణ కాలనీ జయ భూమీ వెంచర్ లో స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణకు కోటి మొక్కలహారం, మొక్కలు నాటే కార్యక్రమంను శనివారం ఎమ్మెల్యే మొక్కలు నాటి ప్రారంభించారు. జీవకోటి ఆరోగ్యంగా ఉండడానికి మొక్కలు ఎంతో దోహద పడతాయని ఎమ్మెల్యే ప్రభాకర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఎస్ భాస్కర్ రెడ్డి, సీపీవో నాయక్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, మున్సిపల్ కౌన్సిలర్లు ఆలే నాగరాజు, బొడిగ అరుణ బాలకృష్ణ, తాడూరి శిరీష పరమేష్, దండ హిమబిందు అరుణ్ కుమార్, బండమీది మల్లేష్, కొయ్యడ సైదులు, కొరగాని లింగస్వామి, సుల్తాన్ రాజు, బత్తుల స్వామి, కామిశెట్టి భాస్కర్, బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు ముత్యాల ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కానుగుల వెంకటయ్య, గ్రంథాలయం చైర్మన్ ఉడుగు మల్లేష్, షాదిఖాన చైర్మన్ ఎండి ఖలీల్ తదితర నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement