Thursday, May 2, 2024

ఆంధ్రప్రదేశ్ లో అల్యూమినియం కాయిల్ యూనిట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దుబయ్ ఎక్స్ పో పర్యటన బిజిబిజీగా సాగుతోంది. వరుస సమావేశాలు, కీలక ఒప్పందాలతో మంత్రి మేకపాటి నేతృత్వంలోని బృందం  ముందుకువెళుతోంది. ఇప్పటికే 4 ఒప్పందాలు కుదుర్చుకున్న ఏపీఈడీబీ మరో కీలక అల్యూమినియం కాయిల్, పానెళ్ళ తయారీ యూనిట్ ను ఆంధ్రప్రదేశ్ లో  ఏర్పాటు దిశగా అలుబండ్ గ్లోబల్ లిమిటెడ్ పరిశ్రమతో ఎంవోయూ ప్రక్రియ పూర్తి చేసింది. ప్రభుత్వ సలహాదారు జుల్ఫీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమక్షంలో గురువారం సాయంత్రం ఏపీఈడీబీ సీఈవో జవ్వాది సుబ్రమణ్యం, అలుబండ్ గ్లోబల్ ఛైర్మన్ షాజి ఎల్ ముల్క్ ఇరువురు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి మార్చుకున్నారు. 200 మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే అలుబండ్ గ్లోబల్ పరిశ్రమకు అవసరమైన 150 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement