Friday, July 12, 2024

రాష్ట్రంలోని పిల్లలందరూ చదువుకోవాలి.. సీఎం జగన్

రాష్ట్రంలోని పిల్లలందరూ చదువుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని బాపట్లలో జగనన్న విద్యాదీవెన పథకం కింద ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపు కార్యక్రమంలో జగన్ మాట్లాడుతూ… పిల్లలకు ఇచ్చే విలువైన ఆస్తి చదువు మాత్రమేనన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ఎంత ఉన్నా ప్రభుత్వమే చదివిస్తుందన్నారు. ఇలాంటి విధానం 28రాష్ట్రాల్లో ఎక్కడా లేదన్నారు. గత ప్రభుత్వ బకాయిలు రూ.1778కోట్లతో కలిపి ఇప్పటి వరకు రూ.11,715కోట్లు విడుదల చేశామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement