Sunday, May 5, 2024

యూపీ తర్వాత ఏపీకే అత్యధిక ప్రాధాన్యత.. నితిన్ గడ్కరీ

తిరుపతి, జులై 13( ప్రభ న్యూస్ బ్యూరో) : దేశంలో యూపీ తర్వాత ఆంద్రప్రదేశ్ లో జాతీయ రహదారుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. తిరుపతిలో గురువారం రూ.2900 కోట్లతో అభివృద్ధి చేయనున్న జాతీయ రహదారుల ప్రాజెక్ట్ కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు..అంతకు మునుపు తిరుమలలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు..అక్కడి నుంచి టిటిడి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రిని సందర్శించారు.. అనంతరం పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు..తిరుపతి ఎస్ వి యూ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు..అవి ఆయన మాటల్లోనే…ఏపీ రాష్ట్రానికి చెందిన ఎంపి లు కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో పనితీరు కనబరుస్తున్నారు. ఏపీలో మూడు మేజర్ పోర్టులు అభివృధ్ది చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దేశంలోనే విశాఖ పట్నం మేజర్ పోర్ట్ అభివృధ్ది అన్నారు. తిరుపతిలో ఇంటర్నేషనల్ సెంట్రల్ బస్ స్టేషన్ నిర్మాణం, రూ.500 కోట్లతో ఏపీ ప్రభుత్వం – నేషనల్ హైవే సంస్థ మధ్య ఎం.వో యు జరిగిందన్నారు.

ఇంటర్నేషనల్ ఆర్క్ టెక్ నిర్మాణం చేస్తామన్నారు. దేశంలో ఏడు గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారులు అభివృధ్ది చేస్తున్నామన్నారు. బెంగళూరు – చెన్నై మధ్య అభివృద్ధికి రూ.20 వేల కోట్లతో 260 కి.మీ రహదారి నిర్మాణం చేపట్టామని, వీటిలో 92 కి.మీ ఏపీ గుడిపాల మీదుగా వెళ్తుందన్నారు. చిత్తూరు తచూరు 82 కి.మీ రూ.4,800 కోట్లు, ఢిల్లీ – చెన్నై గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి.. వీటిలో ఢిల్లీ నుంచి ముంబై మధ్య లక్ష కోట్లతో రహదారి నిర్మాణం చేపడుతున్నామన్నారు. సూరత్ నుంచి చెన్నై వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే.. ఏపీ గుండా 145 కి.మీ వెళ్తుందన్నారు. దీనికి రూ.5వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. బెంగళూరు – విజయవాడ మధ్య 330 కి.మీ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం, దీని ద్వారా 95 కి.మీ దూరం తగ్గుతుందన్నారు. ఆరు గంటల్లో చేరుకోవచ్చన్నారు.

రాయపూర్ – విశాఖ మధ్య రూ.17 వేల కోట్లతో నిర్మాణం జరుగుతుందన్నారు. హైదరాబాద్- విశాఖ మధ్య రూ.7 వేల కోట్లతో నిర్మాణం, నాగ్ పూర్ – విజయవాడ మధ్య గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం జరుగుతుందన్నారు. బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత 8744 కి.మీ జాతీయ రహదారులు నిర్మాణం చేపట్టామని, ఏపీలో డబుల్ గా 2023 లో చేశామన్నారు. ఏపీ చాలా ముఖ్యమైన రాష్ట్రమన్నారు. దేశంలోనే విశాఖపట్నం మేజర్ పోర్ట్స్ ఒకటి ఉందన్నారు. జాతీయ రహదారుల నిర్మాణం ద్వారా ఏపీ పారిశ్రామికంగా మరింత అభివృధ్ది చెందుతోందన్నారు.తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement