Friday, May 17, 2024

పవన్ మతమార్పిడులు ప్రోత్సాహిస్తున్నారు: మాధవి లత సంచలన ఆరోపణ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై బిజెపి నాయకురాలు, సినీ నటి మాధవి లత సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ మతమార్పిడులు ప్రోత్సాహిస్తున్నారని ఆమె ఆరోపించారు. ‘’పవన్ కళ్యాణ్ గారు క్రిస్మస్ విషెస్ చెప్పండి. నమ్మిన వారికి విషెస్ అని చెప్పండి ఇంకా సంతోషం మానవాళికి ఇలాంటి పెద్ద మాటలు ఎందుకండీ? మీరే మత మార్పిడులకు ఎంకరేజ్ చేసేలా మీ పోస్టు ఉంది. విషెస్ పెట్టండి. బైబిల్ ను మనమే బోధించనక్కర్లేదు. అక్కడ ఎవరు దేవుడు లేరు. మీరు చెప్పిన విషెస్ తప్ప మీరు రాసిన కంటెంట్ నాకు నచ్చలేదు. హిందూ మతస్థులను క్రైస్తవ మతం లోకి వచ్చేలా మీ పోస్టు ఉంది. ఇలాంటి పోస్టులు మానుకోండి” అంటూ మాధవి లత పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement