Friday, May 3, 2024

Breaking: నెల్లూరు జిల్లాలో యాక్సిడెంట్‌.. యువ‌కుడిని ఢీకొట్టిన కారు, అక్క‌డిక‌క్క‌డే మృతి

శ్రీ పొట్టి శ్రీ‌రాములు నెల్లూరు జిల్లాలో ఇవ్వాల (సోమ‌వారం) రాత్రి యాక్సిడెంట్ జ‌రిగింది. కావ‌లి రూర‌ల్ మండ‌లం గౌర‌వ‌రం వ‌ద్ద అతివేగంతో వ‌చ్చిన కారు ఓ యువ‌కుడిని ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ఆ వ్య‌క్తి అమాంతం గాలిలోకి లేచి కింద‌ప‌డ్డాడు. ఇక అత‌డిని అటువైపు వ‌చ్చిన టెంపో 100 అడుగుల దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్ర‌మాదంలో ఆ వ్య‌క్తి అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయాడు. సంఘ‌ట‌నా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఎవ‌ర‌న్న విష‌యం ఇంకా తెలియ‌లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement