Tuesday, November 28, 2023

AP: నిరంత‌రం పేద‌ల కోసం ఆలోచించే వ్య‌క్తి జైల్లోనా… : భువనేశ్వరి ఆవేద‌న

జగ్గంపేట: తెదేపా అధినేత చంద్రబాబు ఏం తప్పు చేశారని జైల్లో పెట్టారని.. నిరంత‌రం పేద‌ల కోసం ఆలోచించే వ్య‌క్తి జైల్లోనా అంటూ చంద్ర‌బాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రశ్నించారు. జగ్గంపేట దీక్షా శిబిరంలో ఆమె మాట్లాడారు. ‘‘చంద్రబాబు ప్రజల మనిషి. చంద్రబాబుకు ఊపిరే ప్రజలు. శిలలపై శిల్పాలు చెక్కారు.. రాళ్లు, రప్పల మధ్య హైటెక్‌ సిటీని నిర్మించారు. దాంతో రూ.వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తోంది. అదీ ఆయన ఆలోచన. ఒక్కోసారి చాలా బాధ అనిపిస్తుంది. ప్రజల కోసం రాత్రింబవళ్లు కష్టపడిన మనిషిని జైల్లో నిర్బంధించారు. ఆయన చేసిన తప్పు ఏంటో ప్రజలు నిర్ణయించాలి’’ అని కోరారు.

- Advertisement -
   

ప్రజల సొమ్ములను తీసుకోవాల్సిన అవసరం తమ కుటుంబానికి లేదని టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి అన్నారు. తానే సొంతంగా ఒక సంస్థను నడుపుతున్నానని… ఆ సంస్థలో 2 శాతం వాటా అమ్మినా తమకు రూ. 400 కోట్లు వస్తాయని చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా వందల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు చిన్న తప్పు కూడా చేయలేదని చెప్పారు. చంద్రబాబు ఎప్పుడూ ప్రజల సంక్షేమం కోసమే ఆలోచిస్తారని అన్నారు. తనతో పాటు ప్రజలను కూడా ముందుకు తీసుకెళ్లడమే ఆయన లక్ష్యమని చెప్పారు. ఏం తప్పు చేశారని ఆయనను జైల్లో పెట్టారని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement