Thursday, March 28, 2024

వాగులో చిక్కుకున్న కారు.. రక్షించిన స్థానికులు

ఒంగోలు, ప్రభ న్యూస్ బ్యూరో : ఏపీలో భారీగా కురుస్తున్న వ‌ర్షాల‌తో వాగులు, వంక‌లు పొంగి ప్ర‌వ‌హిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నాగులుప్పలపాడు సమీపంలోని కొత్తకోట వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అయితే ఈ మార్గంలో వెళ్తున్న ఓ కారు ప్రవాహానికి కొట్టుకుపోయింది. దాన్ని గమనించిన స్థానికులు కారులో ఉన్న వారిని రక్షించారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో పెను ప్రమాదం తప్పింది.

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు.. నాగులుప్పలపాడు మండలం గ్రోత్‌ సెంటర్ నుంచి ఉప్పుగుండూరు వెళ్లే మార్గంలో కొత్తకోట కాలువ.. ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ మార్గంలో వెళ్తున్న ఇన్నోవా కారు.. వాగు మధ్యలోకి వెళ్లగానే ప్రవాహానికి కొట్టుకుపోయింది. దాన్ని గమనించిన స్థానికులు కారులోని వారిని రక్షించారు. ట్రాక్టర్ సహాయంతో కారును కూడా బయటికి లాక్కొచ్చారు. కారు కొట్టుకుపోయే సమయంలో స్థానికులు అక్కడే ఉండటంతో.. పెద్ద ప్రమాదం తప్పింది. ఎవరూ లేకపోతే.. కారులో ఉన్న ముగ్గురు గల్లంతయ్యే ప్రమాదం ఉండేది.

Advertisement

తాజా వార్తలు

Advertisement