Thursday, May 2, 2024

మూడు చోట్ల టాస్క్ ఫోర్సు దాడులు : 48మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు

తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో ) ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్సు మూడు వేర్వేరు చోట్ల నిర్వహించిన దాడుల్లో 48 మంది ఎర్ర చందనం స్మగ్లర్లు పట్టుబడ్డారు ఈ సందర్బంగా రూ 2 కోట్ల విలువైన 51 ఏ గ్రేడ్ ఎర్రచందనం దుంగలు, రెండు కార్లు, ఒక ఆటో, 6మోటారు సైకిళ్ల ను కూడా టాస్క్ ఫోర్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.
స్థానిక టాస్క్ ఫోర్స్ కార్యాలయం లో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో టాస్క్ ఫోర్సు డీఎస్పీ చెంచుబాబు సంబంధిత వివరాలను వెల్లడించారు .

ఆ వివరాల ప్రకారం టాస్క్ ఫోర్స్ఇనస్పెక్టర్ సురేష్ కుమార్ రెడ్డి అధ్వర్యంలో ఆర్ఎస్ఐలు లింగాధర్, విశ్వనాథ్, వినోద్ కుమార్ రెడ్డి, రాఘవేంద్ర తదితర బృందాలతో దాడులు నిర్వహించారు. మొదట తిరుపతి జిల్లా లక్ష్మీపురం గ్రామ సమీపంలో పెరుమాళ్లపల్లి ఫారెస్ట్ బీటు పరిధిలో కారులో ఎర్రచందనం దుంగలు లోడ్ చేస్తున్న తమిళనాడు తిరువన్నామలై జిల్లా జమునామత్తూరు తాలూకాకు చెందిన కే.కుమార్ (35)ను అరెస్టు చేశారు. అతని నుంచి 9ఎర్రచందనం దుంగలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా సానిపాయ రేంజి పరిధిలో సుండుపల్లి అటవీ ప్రాంతంలో చెక్ పోస్టుకు తూర్పువైపున కూంబింగ్ చేస్తుండగా, కొందరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలను మోసుకుని వస్తూ కనిపించారు. వారిని చుట్టుముట్టి వారిలో 19 మందిని పట్టుకున్నారు. 21ఎర్రచందనం దుంగలతో పాటు, 5మోటారు సైకిళ్లు, ఒక కారును స్వాధనం చేసుకున్నారు.

వీరిని తమిళనాడు వేలూరు జిల్లాకు చెందిన దామోదరన్ పొన్నుస్వామి(36), శశికుమార్ జయపాల్ (27), షన్ముగం పొన్నుస్వామి (52), వేంకటేశన్ పెరుమాళ్ (35), దేవరాజ్ గోవిందస్వామి (27), మోహన్ (28), రాజేష్ రాజేంద్రన్ (24), రామకుమార్ దురైస్వామి (31), మురుగన్ కుప్పన్ (49), మణి చిన్నపయ్యన్ (29), అలగేశన్ చక్కరై (32), గోవిందరాజ్ మురుగేశన్ (25), చిన్నస్వామి (34), బాబు (18), గోపి సర్కారై (30), తిరువన్నామలై జిల్లా జమునామత్తూరుకు చెందిన రామస్వామి (29), శంకర్ చిన్నస్వామి (32), వెంకటేషన్ (45), కర్నాటక కోలారు జల్లాకు చెందిన ఆర్ భాస్కర్ (30)లు గా గుర్తించారు..

- Advertisement -


అదేవిదంగా అన్నమయ్య జిల్లా బాలపల్లి రేంజిలోని సిద్దలేరు బేస్ క్యాంప్ వద్ద అరిమాను బండ సమీపంలో కొందరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలు డ్రెస్సింగ్ చేస్తూ కనిపించారు. వారిని చుట్టు ముట్టి 28మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారినుంచి 21ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఒకటి డ్రెస్సింగ్ పూర్తి చేయలేదు. మరొక దుంగ 51కిలోలతో అత్యంత ఎక్కువ బరువు ఉంది. వీరి నుంచి ఒక మోటారు సైకిల్, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. . అరెస్టయిన వారిలో తమిళనాడు వేలూరు జిల్లా సేలం ప్రాంతానికి చెందిన పళని (43), కల్లకురుచ్చి జిల్లా వెల్లిమలైకు చెందిన ఆండీ (40),జయకుమార్ (35), సేలం జిల్లా విజయకుమార్ (32), సెంథిల్ (36), రాజేంద్రన్ (30), మణి (26), కనకరాజ్ (28), ఆండీ (45), కామరాజ్ (30), మురుగేశన్ (39), పళని స్వామి (34), అన్నామలై ((40), కుళ్లన్ ఆండీ (45), ఆర్ముగం (42), చిన్నపయ్యన్ (45), మాణిక్యం (30), మురుగేశన్ (37), వెంకటేష్ (36), కల్లకురిచ్చి జిల్లా మాణిక్యం(40), ధనపాలు(32), భాగ్యరాజ్ (34), అన్బళగన్ (43), అళగరాజ్ (33), మహాలింగం(43), లక్ష్మణన్ (45), తిరువళ్లూరు జిల్లాకు చెందిన పీకే.మురళి (33), చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలానికి చెందిన ఎన్.భాస్కర్ బాబు (39) ఉన్నారు. వీరిని అరెస్టు చేశామని, కోర్టులో ప్రవేశ పెడతామని అన్నారు.

మొత్తం 51దుంగలు 1,588 కిలోల బరువు ఉన్నాయని తెలిపారు. వీటి విలువ సుమారు రూ.2కోట్లు ఉంటాయని అన్నారు. ఈ కేసులను తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ లో నమోదు చేశామని, సీఐ శ్రీనివాసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆ ఆపరేషన్లలో దాదాపు 50మంది టాస్క్ ఫోర్సు సిబ్బంది పాల్గొన్నారని, వీరికి డీఐజీ సెంథిల్ కుమార్ రివార్డులు ప్రకటించారని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement